కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ మన్నే సతీశ్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు..!
TeluguStop.com
హైదరాబాద్ లోని గాంధీభవన్ ( Gandhi Bhavan ) కు ఢిల్లీ పోలీసులు చేరుకున్నారు.
ఈ మేరకు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ మన్నే సతీశ్( Manne Satish
) కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో సీఆర్పీసీ 91 కింద ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు.అయితే ఫిర్యాదు ఎవరు ఇచ్చారని కాంగ్రెస్ నేతలు అడిగారని తెలుస్తోంది.
కాగా రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా ( Amit Shah ) పేరుతో ఉన్న ఫేక్ వీడియోను వైరల్ చేశారని కాంగ్రెస్ పై ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే బీజేపీ ఫిర్యాదుతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.
ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారన్న దానిపైన స్పెషల్ సెల్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేస్తుంది.
విచారణలో భాగంగా కాంగ్రెస్ నేతలకు పోలీసులు నోటీసులు అందిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే డీప్ ఫేక్ వీడియోలు చేసిన వారికి తగిన బుద్ది చెబుతామని కర్ణాటక సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వార్నింగ్ ఇచ్చారు.
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ…