ఢిల్లీ మున్సిపల్ మేయర్ ఎన్నిక వాయిదా

ఢిల్లీ మున్సిపల్ మేయర్ ఎన్నిక వాయిదా పడింది.బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల మధ్య వివాదం చెలరేగడంతో ఎన్నిక వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

ఈ మేరకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ తదుపరి నోటీస్ ఇచ్చేంత వరకు ఎన్నికను వాయిదా వేయాలని నిర్ణయించారు.

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన తాత్కాలిక స్పీకర్ సత్య శర్మ, మేయర్ ఎన్నికకు ముందు సభకు నామినేటెడ్ సభ్యులు ప్రమాణస్వీకారం చేయడంపై ఘర్షణ చెలరేగింది.

ఎన్నికైన సభ్యులను కాకుండా నామినేటెడ్ సభ్యులతో ఎలా ముందుగా ప్రమాణం చేయిస్తారంటూ సభ్యులు నిరసనకు దిగారు.

ప్రభుత్వాన్ని సంప్రదించకుండా లెఫ్టినెంట్ గవర్నర్ పది మంది నామినేటెడ్ సభ్యుల పేర్లను పేర్కొనడంపై ఆప్ అభ్యంతరం తెలిపింది.

పెట్రోల్ కొట్టించుకొని డబ్బులు కట్టకుండా ఏం మాస్టర్ ప్లాన్ చేసావ్ గురూ.. (వీడియో)