ఉత్తరాదిని హడలెత్తించిన డాన్, ఎంకౌంటర్ లో మృతి

ఢిల్లీ తో పాటు ఉత్తరాది రాష్ట్రాలను హడలెత్తించిన తెలుగు వ్యక్తి,డాన్ శివ శక్తి నాయుడు మీరట్ లో పోలీసుల ఎంకౌంటర్ లో మృతి చెందినట్లు తెలుస్తుంది.

ఏసీపీని చంపేందుకు కుట్ర పన్నుతున్న అతడిని పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో మృతి చెందాడు.

వాస్తవానికి శివశక్తి తండ్రి తెలుగువాడే అయినప్పటికీ బతుకు తెరువు కోసం ఎప్పుడో ఢిల్లీ కి వెళ్లిపోయారు.

అయితే అక్కడే ఒక వస్త్ర దుకాణం నడిపేవాడు.అయితే మొదట్లో తండ్రికి వ్యాపారం లో సాయంగా ఉండేవాడు అయితే ఆ తరువాత డబ్బు మీద మోజు తో సుపారీ హత్యలు,దారి దోపిడీలు, కిడ్నాప్ ల్లో ఆరితేరిపోయాడు.

క్రమంగా అక్కడ డాన్ గా మారిపోయాడు. """/"/అంతేకాకుండా హవాలా వ్యాపారం కూడా చేసి ఒక వ్యాపారి నుంచి రూ.

8 కోట్లు లూటీ చేసినట్లు కూడా వార్తల్లో వచ్చింది.అలానే సెలబ్రిటీ ల నుంచి కూడా డబ్బులు వసూలు చేసినట్లు కూడా ప్రచారం ఉంది.

జైపూర్‌లో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌ కుంద్రా నుంచి రూ.

8కోట్ల రూపాయలు బెదిరించి వసూల్ చేశాడు శివశక్తి.లూథియానాలో ఓ వ్యాపారి నుంచి ఆరు కోట్లు వసూలు చేశాడు.

ఈ క్రమంలో ఆరేళ్ల పాటు తీహార్ జైల్లోనూ గడిపిన నాయుడు.ఆ తరువాత పెరోల్‌ మీద విడుదలయ్యాడు.

అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.అయితే మీరట్ లో ఒక ఖరీదైన అపార్ట్ మెంట్ లో శివశక్తి నాయుడు ఉన్నట్లు అధికారులకు సమాచారం రావడం తో పోలీసులు అక్కడకు చేరుకోగా కాల్పులకు పాల్పడ్డారు.

దీనితో ఒక పోలీసు కూడా గాయపడినట్లు తెలుస్తుంది.ఇక పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరపడం తో ఈ ఎదురుకాల్పుల్లో శివశక్తి నాయుడు హతమైనట్లు తెలుస్తుంది.

శివశక్తి నాయుడు ఒక్క మీరట్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉత్తరాది రాష్ట్రాల్లో పలు చోట్ల తన స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు.