ముమ్మరంగా ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా సీఏ గోరంట్ల బుచ్చిబాబును ఈడీ ప్రశ్నించనుంది.ఈ క్రమంలో ఇవాళ, రేపు తీహార్ జైలులో బుచ్చిబాబును అధికారులు ప్రశ్నించనున్నారు.

రూ.100 కోట్ల మనీ లాండరింగ్ అంశాలపై ఈడీ ఆరా తీయనుంది.

ఈ కుంభకోణం, మనీలాండరింగ్ కేసులో ఇటీవల మాగుంట రాఘువతో పాటు అరుణ్ పిళ్లైని ఈడీ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.

వారి నుంచి సేకరించిన సమాచారంతో బుచ్చిబాబును ప్రశ్నించనున్నారని తెలుస్తోంది.కాగా ఫిబ్రవరి 8వ తేదీన లిక్కర్ కేసులో గోరంట్ల బుచ్చిబాబును అరెస్ట్ చేశారు.

అయితే ఎల్లుండితో బుచ్చిబాబు జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది.

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీపై వరుస విమర్శలు.. ఇంత నెగిటివిటీకి కారణాలివేనా?