ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ ప్రారంభం అయింది.

మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన అరుణ్ పిళ్లై బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం విచారణ చేస్తుంది.

అయితే అరుణ్ పిళ్లైని మార్చి 6న అరెస్ట్ చేసిన ఈడీ బెయిల్ ఇవ్వొద్దంటూ న్యాయస్థానాన్ని కోరుతుంది.

ఇండో స్పిరిట్స్ కంపెనీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రతినిధిగా అరుణ్ పిళ్లై వాటాలు కలిగి ఉన్నారని ఈడీ ఆరోపిస్తుంది.

అదేవిధంగా మనీ లాండరింగ్ వ్యవహారంలో అరుణ్ పిళ్లై కీలక పాత్ర పోషించారని ఆరోపణలు చేస్తుంది.

దీంతో పిళ్లై బెయిల్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.మరోవైపు సీబీఐ కేసులో అనుబంధ ఛార్జ్ షీట్ పై విచారణ జరిపిన కోర్టు తదుపరి విచారణను జూలై 6 కు వాయిదా వేసింది.

ఇది విన్నారా.. కుక్కపిల్లలకు బారసాల వేడుకలంట (వీడియో)