మెడలోతు వరద నీటిలోకి దిగి రిపోర్టింగ్.. ఇదెక్కడి పైత్యం అంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు..

భారత రాజధాని ఢిల్లీ( Delhi )లో ఎన్నడూ లేనివిధంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

దీనివల్ల ఢిల్లీ నగరమంతా జలమయమయ్యింది.వరదల వల్ల సిటీలోని ప్రాంతాలు ఎలా మునిగిపోయాయో, ప్రజలు ఎలా ఇక్కట్లు పడుతున్నారు రిపోర్ట్‌ చేయడానికి జర్నలిస్టులు పెద్ద సాహసాలే చేస్తున్నారు.

అయితే తాజాగా ఒక లేడీ జర్నలిస్టు మెడలోతు వరద నీటిలోకి దిగి రిపోర్టింగ్ చేసింది.

ఈ జర్నలిస్టు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ( NDRF ) సిబ్బందికి అందించిన రెస్క్యూ ఎక్విప్మెంట్‌ను ధరించి మరీ రిపోర్టింగ్ కొనసాగించింది.

దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌ యూజర్ రత్తన్ ధిల్లాన్ తాజాగా షేర్ చేశారు.

ఆ వీడియోలో లేడీ జర్నలిస్ట్ వరద నీటిలో దాదాపు మెడలోతు మునిగిపోయి ఉండడం చూడవచ్చు.

ఆమె పూర్తిగా మునగకుండా ఉండేందుకు ఒక సేఫ్టీ ట్యూబ్‌ను ధరించింది.ఆ తర్వాత మైక్ పట్టుకొని రిపోర్టింగ్ చేయడం ప్రారంభించింది.

"""/" / ఆ లేడీ రిపోర్టర్‌కు సమీపంలోనే ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం బోట్‌లో కనిపించింది.

వారు ఆ లేడీ జర్నలిస్టుకు ఏదైనా జరిగితే కాపాడడానికి సిద్ధంగా ఉన్నారు.ఒక ఎన్‌డీఆర్‌ఎఫ్ ఉద్యోగి ఆ న్యూస్ ఛానల్ కెమెరా ముందు నిల్చుని ఫోజులు తీయడం కూడా కనిపించింది.

మొత్తం మీద ఒక ఒక జోక్ లాగా ఈ సిచువేషన్ ని వారు మార్చేశారు.

పద్ధతిగా పైన ఉండి రిపోర్టింగ్ చేయకుండా నీటిలోకి దిగి పెద్ద షో చేయాలని ఈ రిపోర్టర్ ఛానల్ యాజమాన్యం అనుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉందని నెటిజన్లు అంటున్నారు.

"""/" / ఈ వీడియో షేర్ చేసిన ధిల్లాన్ కూడా ఇదెక్కడి పైత్యం అన్నట్లు ఈ రిపోర్టర్ ని తిట్టిపోశారు.

ఇది ఒక రిపోర్టింగేనా అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఆమె ఎన్‌డీఆర్‌ఎఫ్ వాలంటీర్‌ చేత తన ఫొటోలు కూడా తీయించుకుందని విమర్శించారు.

జనాలను కాపాడుకుండా, ఇలాంటి పిచ్చి రిపోర్టింగ్ చేస్తూ ఎవరికీ ఏం ప్రయోజనం చేకూర్చుతున్నారంటూ ఆయన చివాట్లు పెట్టారు.

పబ్లిసిటీ కోసం NDRF పరికరాలను ఉపయోగించడమేంటని మరికొంతమంది నెటిజన్లు రిపోర్టర్‌ను తిట్టిపోస్తున్నారు.