Arvind Kejriwal : కేజ్రీవాల్ అరెస్ట్, ఈడీ కస్టడీపై ఢిల్లీ హైకోర్టు తీర్పు రిజర్వ్
TeluguStop.com
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( CM Arvind Kejriwal ) అరెస్ట్, ఈడీ కస్టడీపై ఢిల్లీ హైకోర్టు తీర్పును( Delhi High Court ) రిజర్వ్ చేసింది.
ఈ మేరకు పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం సాయంత్రం 4 గంటలకు తీర్పును వెలువరించనుంది.
కేజ్రీవాల్ అరెస్ట్, ఈడీ కస్టడీపై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి.ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కేజ్రీవాల్ అరెస్ట్ పై( Kejriwal Arrest ) ఈడీకి నోటీసులు జారీ చేసింది.
కాగా కేజ్రీవాల్ తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు.ఈ క్రమంలో కేజ్రీవాల్ అరెస్ట్ చట్ట విరుద్ధమన్న సింఘ్వి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత సిట్టింగ్ సీఎంను అరెస్ట్ చేయడం సరికాదని పేర్కొన్నారు.
ఇది కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీని నిర్వీర్యం చేసే ఉద్దేశంతో జరిగిన అరెస్ట్ అని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ను వెంటనే ఈడీ కస్టడీ( ED Custody ) నుంచి విడుదల చేయాలని కోర్టును కోరారు.
మరోవైపు ఈడీ తరపున అడిషనల్ సొలిసిటరీ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు.
కేజ్రీవాల్ అరెస్ట్, మధ్యంతర ఉపశమన పిటిషన్లపై ప్రత్యుత్తరం దాఖలు చేయడానికి ఈడీ సమయం ఇవ్వాలని కోర్టును కోరింది.
ఇరు పక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు.. పోలీస్ స్టేషన్ కు తరలింపు..