ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ( BRS MLC Kavita )బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టులో( Delhi High Court ) విచారణ జరిగింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో మనీలాండరింగ్ కేసులో ( Money Laundering Case )కవిత బెయిల్ పిటిషన్ పై ఈడీ కౌంటర్ దాఖలు చేసింది.

మరోవైపు కవిత బెయిల్ పిటిషన్ పై ఈ నెల 27వ తేదీన సమాధానం ఇస్తామని సీబీఐ పేర్కొంది.

కేసులో కవిత పాత్రపై జూన్ 7న ఛార్జిషీట్ దాఖలు చేస్తామని సీబీఐ వెల్లడించింది.

కోర్టులో మిగిలిన కేసుల విచారణ పూర్తయిన తరువాత కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ జరుపుతామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.

వర్షాకాలంలో చేపలు తింటున్నారా.. అయితే ఈ జబ్బులు ఖాయం!