నీటి సమస్యపై సుప్రీంకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం..!!

ఢిల్లీ( Delhi )లో నెలకొన్న నీటి సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

నీటి ఎద్దడి కారణంగా ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది.యూపీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుంచి నెల రోజుల పాటు నీరు అందించాలని ఢిల్లీ సర్కార్ పిటిషన్ లో కోరింది.

ఎండల తీవ్రత నేపథ్యంలో ఢిల్లీలో నీటి అవసరం పెరిగిందన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ( Central Govt )చొరవ తీసుకోవాలని తెలిపింది.

ఈ క్రమంలోనే దేశ రాజధాని నీటి అవసరాలు తీర్చడం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొంది.

మరోవైపు ఆప్ ప్రభుత్వం ట్యాంకర్ మాఫియాను ప్రోత్సహిస్తోందని బీజేపీ ఆరోపిస్తుంది.ఈ నేపథ్యంలోనే సర్కార్ కు వ్యతిరేకంగా బీజేపీ నిరసనలు చేస్తోంది.

వైరల్ : భాగస్వామి లేకుండానే 14 పిల్లలను కన్న కొండ చిలువ..