వైయస్ జగన్ ప్రభుత్వం పై ఢిల్లీ సర్కార్ ప్రశంసలు..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్రేజ్ ఉన్న కొద్దీ పెరుగుతుంది.ముఖ్యమంత్రి అయ్యి రెండు సంవత్సరాలు ఇంకా పూర్తి కాకముందే దేశవ్యాప్తంగా సీఎం రేసులో సీనియర్లకు మంచి పోటీ ఇస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యావ్యవస్థలో సరికొత్త మార్పులు తీసుకొస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాలు ఇతర రాష్ట్రాలను కూడా ప్రభావితం చేస్తున్నట్లు తెలుస్తోంది.

అందువల్లనే ఆమె ఇటీవల అంతర్జాతీయ విద్యా సదస్సు లో వైయస్ జగన్ ప్రభుత్వం పై ఢిల్లీ ప్రభుత్వం ప్రశంసల వర్షం కురిపించింది.

ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా జగన్ పరిపాలన గురించి మాట్లాడుతూ ఏప్రిల్లోనే విద్యారంగం సంస్కరణలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది అంటూ కొనియాడారు.

నాడు నేడు, విద్యా కానుక, ప్రీస్కూల్ విధి విధానాల గురించి తెలుసుకొని ఢిల్లీ డిప్యూటీ సీఎం జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.

అంతేకాకుండా త్వరలో ఈ పథకాల పనితీరు ఎలా ఉంటుందో అన్న దానిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తానని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటె జరిగిన ఈ సదస్సులో ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంకా అనేక విషయాల గురించి చెప్పడంతో.

మిగతా రాష్ట్రాలకు చెందిన నాయకులు కూడా ఏపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులు తమ రాష్ట్రంలో కూడా తీసుకు వచ్చే విధంగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.

 .

వార్2 సినిమా గురించి క్రేజీ అప్ డేట్ వైరల్.. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ అలా ఉంటుందా?