పెట్రోల్ విషయంలో ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!!

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో కేంద్ర ప్రభుత్వం గత కొద్ది నెలల నుండి పెంచుకుంటూ పోతున్న సంగతి తెలిసిందే.

ఎన్నడూ లేనివిధంగా ఊహించని రీతిలో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు లీటర్ వంద రూపాయలు దాటే.

పరిస్థితి ఉన్న తరుణంలో.ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు మండిపడుతున్నారు.ఇటువంటి తరుణంలో పెట్రోల్, డీజిల్ ధరలు విషయంలో ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది.

పెట్రోల్  పై 8 రూపాయలను తగ్గించింది.పెట్రోల్‌పై వ్యాట్‌ను 30 శాతం నుంచి 19.

40శాతానికి తగ్గించినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌  103 రూపాయలకు చేరుకుంది.

ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.ఢిల్లీవాసులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే బాటలో దేశంలో  మరి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.

వచ్చే ఏడాది దేశంలో ఐదు రాష్ట్రాలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలని  దృష్టిలో పెట్టుకుని పెట్రోల్, డీజిల్ విషయంలో మరికొన్ని పార్టీలు కూడా ఇదే తరహాలో ఆలోచన చేస్తున్నట్లు టాక్.

రికార్డు కోసం ఐస్‌బాక్స్‌లో 4 గంటలు నిలబడ్డాడు.. చివరికి ఏమైందో తెలిస్తే..