ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ పీఠం మీద ఏకంగా మూడు సార్లు కూర్చున్న ధీర మహిళా షీలా దీక్షిత్ కన్ను మూశారు.

గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న ఆమె ఢిల్లీలో ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

ఇక ఆమె పరిస్థితి క్షీణించడంతో ఈ రోజు తుది శ్వాస విడిచారు.పంజాబ్ లోని కపుర్తలలో జన్మించిన షీలా దీక్షిత్ చిన్న వయసులోనే రాజకీయాలలోనే వచ్చి కాంగ్రెస్ పార్టీ తో తన ప్రస్తానం కొనసాగిస్తూ వచ్చారు.

ఇక ఈ నేపధ్యంలో ఆమెని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టింది.తరువాత ఆమె పాలనా దక్షతతో ఏకంగా మూడు సారూ కాంగ్రెస్ పార్టీని ఢిల్లీలో అధికారంలోకి తీసుకొచ్చింది.

ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకోవడంతో పాటు, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ మీద ఢిల్లీ ప్రజలు అభిమానం పెరగడంతో ఆ పార్టీ చేతిలో ఓడిపోయింది.

అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకి దూరంగా ఉంటూ వస్తున్న ఆమెని తరువాత కేరళ గవర్నర్ గా నియమించారు.

ఇక ఆ బాద్యతల నుంచి తప్పుకున్న ఆమె మృతి చెందారు.ప్రస్తుతం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా వ్యవహరిస్తున్న ఆమె మృతిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీవ్రం దిగ్బ్రాంతి వ్యక్తి చేసింది.

ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఆమె మృతిపై సంతాపం వ్యక్తం చేసారు.

పార్లమెంట్ ఎన్నికల వేళ భువనగిరి బీజేపీలో గ్రూప్ వార్..!