రౌస్ అవెన్యూ కోర్టుకు ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా
TeluguStop.com
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచనున్నారు.
ఈ క్రమంలో సీబీఐ కార్యాలయంలో నిన్న రాత్రి సిసోడియాకు వైద్య పరీక్షలు నిర్వహించిన అధికారులు ఇవాళ మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు.
అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఆయనను న్యాయస్థానం ఎదుట హజరుపరచనున్నారు.అయితే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
సిసోడియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయని సీబీఐ వాదిస్తుంది.ఈ క్రమంలో దర్యాప్తునకు సహకరించకపోవడంతోనే అరెస్ట్ చేశామని చెబుతోంది.
ఎక్సైజ్ పాలసీ రూపకల్పనతో పాటు అమలులో కూడా అక్రమాలు ఉన్నాయని సీబీఐ పేర్కొంది.
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?