హైకోర్టు సంచలన తీర్పు, చోరీ చేస్తే శిక్ష ఏంటో తెలుసా!
TeluguStop.com
దొంగతనం చేసి పట్టుబడిపోతే ఇక భయపడాల్సిన అవసరమే లేదు.ఎందుకంటే చోరీ కేసు విచారణ క్లోజ్ చేయాలి అంటే గనుక ఇక ఆ వ్యక్తి జైలు శిక్ష అనుభవించాల్సిన అవసరమే లేదు.
దానికి బదులుగా దొంగతనం చేసిన వ్యక్తి 50 మొక్కలు నాటాలని ఢిల్లీ హైకోర్టు తాజాగా సంచలన తీర్పును వెల్లడించింది.
దొంగలను అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఎలాంటి ఉపయోగం ఉండదని భావించిన కోర్టు సామజిక కార్యకలాపాలు చేయిస్తే కనీసం సమాజానికి మేలు కలుగుతుంది అని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
అయితే ఎదో దొంగతనం చేసి హాయిగా 50 మొక్కలు నాటి కూర్చోవచ్చు అనుకుంటే పొరపాటే.
ఇక్కడే కోర్టు ఒక మెలిక పెట్టింది.నెలరోజుల్లో మొక్కలు పాతాలనీ పశ్చిమ అటవీశాఖ డిప్యూటీ కన్సర్వేటర్.
సెంట్రల్ రిడ్జ్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఎక్కడ మొక్కలు పాతమంటే అక్కడ పాతాలని ఆదేశించింది.
అంతేకాదు ప్రతీ మొక్క వయసూ 3 నుంచీ 3న్నర ఏళ్లకుపైగా ఉండాలనీ, మొక్క ఎత్తు దాదాపు 6 అడుగులు ఉండాలని ఆర్డరేసింది.
ఏ మొక్కలు పాతాలో డిప్యూటీ కన్సర్వేటర్ చెబుతారని కోర్టు ఆదేశించింది.మొక్కల్లో ఒక్కటి తగ్గినా తిరిగి చోరీ కేసు విచారణ మొదలవుతుందని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
"""/"/
మొక్కలు నాటాక వాటిని ఫొటోలు తీసి, పూర్తి వివరాలతో రిపోర్ట్ ఇవ్వాలని డిప్యూటీ కన్సర్వేటర్‌ను కూడా కోర్టు కోరింది.
ఇలా ఆరు నెలలకు ఒకసారి పూర్తి క్లారిటీ తో రిపోర్ట్,ఫోటోలను సబ్మిట్ చేయాలని కోర్టు స్పష్టం చేసింది.
ఇక చోరీ చేశారో ఇంత తతంగం చేయాల్సి ఉంటుంది.ఇక మొక్క నాటి దానిని పెంచి పోషించాల్సిన భాద్యత కూడా ఆ దొంగపై పడుతుంది అన్నమాట.
దీనితో ఆ మొక్క జాగ్రత్తగా పెరిగి ప్రజలకు మేలు కల్పిస్తుంది.
విశాల్ ఆరోగ్యం గురించి రియాక్ట్ అయిన వరలక్ష్మీ శరత్ కుమార్.. అసలేం జరిగిందంటే?