ఢిల్లీ సీఎంను అరెస్ట్ చేయాలి.. టీఎస్ సీఎల్పీ నేత భట్టి సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుపై తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు.

మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయాలన్నారని తెలుస్తోంది.

అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతామని కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చారని భట్టి తెలిపారు.కానీ ఇప్పుడు ఆయనే అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

కేజ్రీవాల్ మార్పునకు ప్రమాదకారిగా మారాడని చెప్పారు.ఈ క్రమంలోనే ఆయనను లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ చేయాలని వెల్లడించారు.

బాబు అల్లుడు కావడం ఎన్టీఆర్ దురదృష్టం.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు వైరల్!