బ్రేకింగ్: కరోనా బారినపడ్డ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్..!!

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కరోనా బారిన పడ్డారు.తనకు కరోనా సోకినట్టు సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేశారు.

అయితే లక్షణాలు తక్కువగా ఉన్నాయని వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసోలేషన్ కి వెళ్లినట్లు త్వరలోనే తిరిగి కోలుకుని బయటకు వస్తానని ఎవరు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

దేశ వ్యాప్తంగా భారీగా నమోదవుతున్న కేసులలో ఎక్కువగా ఢిల్లీలోనే వెలుగులోకి వస్తున్నాయి.అక్కడ పాజిటివిటి 6 కి పైగా నమోదయ్యింది.

అంత మాత్రమే కాక ఇప్పటికే ప్రభుత్వం ఎల్లో అలర్ట్ ప్రకటించడం జరిగింది.అయితే పరిస్థితి ఇంకా విషమించే అవకాశాలు ఉండటంతో రానున్న రోజులలో రెడ్ అలర్ట్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు.

ఈ వారం చివరి నుండి మళ్లీ లాక్ డౌన్ ఢిల్లీలో అమలు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఢిల్లీలో నమోదవుతున్న కేసుల్లో దాదాపు 84 శాతం ఒమిక్రన్ కేసులు వెలుగులోకి వస్తూ ఉండటంతో ఢిల్లీ ఆరోగ్యశాఖ.

మరిన్ని కీలక నిర్ణయాలు త్వరలో తీసుకోనున్నట్లు .వైద్య అధికారులు స్పష్టం చేశారు.

 ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం.షాపింగ్ మాల్స్,  సినిమా ధియేటర్లు ఇంకా విద్యాసంస్థలు విషయంలో.

ఆంక్షలు విధిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.ఈ తరుణంలో కేసులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని ఆంక్షలు విధించడం గ్యారెంటీ అని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు.

జపాన్ లో ఆ తేదీన రిలీజ్ కానున్న దేవర.. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా?