CM Kejriwal : మూడో రోజు ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..!
TeluguStop.com
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మూడో రోజు కస్టడీలోకి తీసుకోనున్నారు.
లిక్కర్ పాలసీ( Liquor Policy ) రూపకల్పనతో పాటు రూ.100 కోట్ల ముడుపులపై అధికారులు ప్రశ్నించనున్నారు.
అదేవిధంగా గోవా ఎన్నికల్లో ( Goa Elections )హవాలా డబ్బు ఖర్చు, నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఈడీ ఆరా తీయనుంది.
లిక్కర్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ పాత్ర మరియు నిందితులతో ఉన్న సంబంధాలపై అధికారులు ప్రశ్నిస్తున్నారు.
ఈ క్రమంలో కవిత, ఇతర నిందితులతో కలిపి కేజ్రీవాల్ ను ఈడీ విచారించనుంది.
ఈ నెల 28 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో ఉండనున్న సంగతి తెలిసిందే.
మరోవైపు కేజ్రీవాల్ కు వైద్యులు సూచించిన మందులు, ఆహారాన్ని అందిస్తున్నట్లు ఈడీ తెలిపింది.
కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు( ED Officials ) అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
Viggo Slots : Application Mobile Et Expérience Mobile (FR)