ఈడీ విచారణకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ దూరం
TeluguStop.com
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు దూరంగా ఉన్నారు.ఈ క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అందించిన నోటీసులపై సీఎం కేజ్రీవాల్ స్పందించారు.
రాజకీయ ప్రేరేపితంతోనే తనకు నోటీసులు జారీ చేశారని కేజ్రీవాల్ అన్నారు.నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునేందుకే నోటీసులు ఇచ్చారని ఆరోపించారు.
ఈ క్రమంలోనే ఈడీ నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.అయితే మద్యం కుంభకోణం కేసులో భాగంగా కేజ్రవాల్ కు ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ షెడ్యూల్ మేరకు ఆయన ఇవాళ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సి ఉంది.
పుష్పరాజ్ లాంటి వ్యక్తులు బయట కూడా ఉన్నారు.. రష్మిక సంచలన వ్యాఖ్యలు వైరల్!