రౌస్ అవెన్యూ కోర్టుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..!!

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal )ను ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు.

కేజ్రీవాల్ ఈడీ కస్టడీ ముగియగా.దాదాపు పది రోజుల పాటు ఆయన కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ మేరకు కేజ్రీవాల్ ను న్యాయస్థానం ఎదుట హాజరుపరచనున్న ఈడీ ఆయనను జ్యుడిషయల్ కస్టడీకి కోరే అవకాశం ఉంది.

జ్యుడిషియల్ కస్టడీ( Judicial Custody )కి ధర్మాసనం అనుమతి ఇస్తే కేజ్రీవాల్ ను కూడా తీహార్ జైలుకు పంపే అవకాశం ఉంది.

"""/" / లిక్కర్ పాలసీ రూపకల్పన( Liquor Policy ), రూ.

100 కోట్ల ముడుపులతో పాటు గోవా ఎన్నికల్లో హవాల నగదు ఖర్చు వంటి పలు అంశాలపై కేజ్రీవాల్ ను ఈడీ ప్రశ్నించింది.

అలాగే కేసులో ఉన్న ఇతర నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేజ్రీవాల్ ను ప్రశ్నించారు.

కాగా లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

చివరికి నువ్వు కూడా కాపీ కాట్స్ లిస్టులో చేరిపోయావా నాగ్ అశ్విన్.. ఎందుకు ఈ కక్కుర్తి !