హైదరాబాద్‎కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్..!

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు హైదరాబాద్‎కు రానున్నారు.ఇందులో భాగంగా మధ్యాహ్నం ప్రగతిభవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఆయన భేటీకానున్నారు.

ముందుగా ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరనున్న కేజ్రీవాల్ బేగంపేట విమానాశ్రాయానికి రానున్నారు.

అక్కడి నుంచి నేరుగా ప్రగతిభవన్ కు చేరుకుంటారు.కాగా ఈ సమావేశంలో ఢిల్లీలో పాలనాధికారంపై కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ పై ప్రధానంగా చర్చించనున్నారు.

అయితే కేంద్రం ఆర్డినెన్స్ ను సీఎం కేజ్రీవాల్ వ్యతిరేకిస్తూ విపక్షాల మద్దతును కూడగట్టుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగానే సీఎం కేసీఆర్ తో ఆయన సమావేశమై చర్చించనున్నారు.

ఇంటర్నెట్‌ని ఊపేస్తున్న ఎగిరే కారు.. ఇండియన్ రోడ్ల కోసమే తయారు చేశారట..?