Delhi CM Arvind Kejriwal Arrest : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్..!!

ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ నీ( CM Arvind Kejriwal ) ఈడీ అరెస్టు చేయడం జరిగింది.

అరెస్టు చేసినా అనంతరం ఈడీ కార్యాలయానికి తరలిస్తున్నారు.గురువారం ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు.

ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మండిపడ్డారు.అదే సమయంలో కేజ్రీవాల్ నీ ఈడీ కార్యాలయానికి తరలించడానికి అధికారులు ప్రయత్నించగా ఇంట్లోనే ప్రశ్నించాలని కోరడం జరిగింది.

మరొక పక్క ఆమ్ ఆద్మీ పార్టీ( Aam Aadmi Party ) నేతలు భారీ ఎత్తున ఆందోళనలు నిరసనలు చేపట్టారు.

"""/" / ఈ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలని పలుమార్లు ఈడీ నోటీసులు( ED Notices ) జారీ చేసిన అరవింద్ కేజ్రీవాల్ పెద్దగా స్పందించలేదు.

దీంతో గురువారం 12 మంది అధికారుల టీం కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు నిర్వహించి.

నాలుగు గంటల పాటు విచారించి అనంతరం అదుపులోకి తీసుకున్నారు.కాగా ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా,( Manish Sicodia ) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో( BRS MLC Kavitha ) పాటు తదితరులను ఈడీ అరెస్టు చేయడం జరిగింది.

"""/" / కేజ్రీవాల్ అరెస్ట్ పై( Kejriwal Arrest ) ఆప్ నేతలు మండిపడుతున్నారు.

ముఖ్యమంత్రిని లొంగదీసుకునేందుకు బీజేపీ ఎన్నో అడ్డదారులు తొక్కుతోందని విమర్శించారు.ఈ చర్యలు మొత్తం ఢిల్లీ ప్రజలు గమనిస్తున్నారు.

అని అన్నారు.పరిస్థితి ఇలా ఉండగా ఈడీ అరెస్టు చేయకుండా తనకు రక్షణ కల్పించాలని కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది.

దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

బాలయ్య ఎన్టీయార్ కాంబోలో మిస్ అయిన మల్టీ స్టారర్ సినిమా ఏంటో తెలుసా..?