గుజరాత్ పైన భారీ విక్టరీ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్…

ఐపీఎల్ లో చాలా టీములు తమ సత్తా చాటుతూ ముందుకు వెళ్తుంటే గుజరాత్ ఢిల్లీ లాంటి టీమ్ లు మాత్రం వెనుకబడిపోతూనే వస్తున్నాయి.

ఇక దానికి తగ్గట్టుగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో డిల్లి టీమ్( Delhi Team ) ఘన విజయం సాధించింది.

ఇక ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన గుజరాత్ టీం కేవలం 89 పరుగులకు ఆల్ అవుట్ అవ్వడంతో చేజింగ్ కి వచ్చిన ఢిల్లీ టీం కేవలం 9 ఓవర్ల లోనే ఈ స్కోర్ ని ఛేదించి ఒక ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

గుజరాత్ టీమ్( Gujarat Team ) ఈ మ్యాచ్ లో ఏమాత్రం ప్రభావం చూపించలేదు.

ఇక అందులో ఏ ఒక్క ప్లేయర్ కూడా మంచి పర్ఫామెన్స్ అయితే ఇవ్వలేదు.

"""/" / ఇక రషీద్ ఖాన్ ( Rashid Khan )ఒక్కడే 32 పరుగులు సాధించినప్పటికీ ఆయనకు సపోర్టుగా నిలిచే మరొక ప్లేయర్ ఏదైనా పోయాడు వరుసగా ప్లేయర్లు అందరు పెవిలియన్ బాట పట్టడంతో ఈ మ్యాచ్ ని ఢిల్లీ తన తన చేతిలోకి రాబట్టుకుంది.

ఇక మొత్తానికైతే ఈ మ్యాచ్ తో ఢిల్లీ( Delhi ) మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకొని ఏడు మ్యాచ్ ల్లో మూడు విజయాలను సొంతం చేసుకొని ఆరు పాయింట్లతో ఆరోవ పొజిషన్ లో కొనసాగుతుంది.

ఇక మొత్తానికైతే రిషబ్ పంత్ సారథ్యం లో ఈ టీము పడుతూ లేస్తూ ముందుకు సాగుతుందనే చెప్పాలి.

"""/" / ఇక హార్దిక్ పాండ్యా ( Hardik Pandya )గుజరాత్ టీమ్ ను వదిలి వెళ్ళిన తర్వాత ఇక్కడ గుజరాత్ టీమ్ పరిస్థితి ఎలా ఉందో అక్కడ ముంబై ఇండియన్స్ టీమ్ పరిస్థితి కూడా అలానే ఉంది.

కాబట్టి ఈ టీమ్ లు అన్నీ కూడా ఇక జరగబోయే మ్యాచ్ లను జాగ్రత్తగా ఆడితే తప్ప వీళ్ళకి ప్లే ఆఫ్ కు చేరుకునే అవకాశాలైతే చాలా తక్కువగా ఉన్నాయనే చెప్పాలి.

అయ్యయ్యో.. అలా పొగిడాడో లేడో.. ఇలా పడిపోయిన మహిళా బైకర్ (వీడియో)