కుప్పంలో ఓట‌మికి కారుకులెవ‌రు.. చంద్ర‌బాబు అంత‌ర్మ‌థ‌నం..

రాజ‌కీయ చాణ‌క్యుడికి సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే స‌వాళ్లు ఎదుర‌య్యాయి.ఈ స‌వాళ్ల‌లో ఆయ‌న గెలుస్తారా అని రాష్ట్రం మొత్తం ఎదురు చూసినా.

చివ‌ర‌కు నిరాశే ఎదుర‌యింది.అదేంటి ఒక‌ప్పుడు ఉమ్మ‌డి రాష్ట్రాన్ని రెండు సార్లు ఏలిన చంద్ర‌బాబు నాయుడు ఇలా అయిపోయార‌ని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

ఎంతో ముంద‌స్తు వ్యూహాల‌ను ర‌చించుకుని జాగ్ర‌త్త‌గా భ‌విష్య‌త్‌ను రూపొందించుకునే చంద్ర‌బాబు నాయుడుకు ఇప్పుడు సొంత నియోజ‌క‌వ‌ర్గంలో గెల‌వ‌డ‌మే పెద్ద త‌ల‌నొప్పిగా మారిపోయింది.

ఇప్ప‌టికే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వైసీపీ ఝ‌ల‌క్ ఇచ్చింది.దీంతో ఈసారి కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలిచి స‌త్తా చాటుకోవాల‌ని, ప‌రువు నిల‌బెట్టుకోవాల‌ని చంద్ర‌బాబు స్వ‌యంగా ప్ర‌చారం చేసినా ఓట‌మి త‌ప్ప‌లేదు.

25 వార్డుల ఉంటే ఇందులో 19 చోట్ల వైసీపీ గెలిచింది.కేవ‌లం 6 వార్డుల్లోనే టీడీపీ విజ‌యం సాధించింది.

క‌నీస పోటీ ఇవ్వ‌కుండానే టీడీపీ చ‌తికిల ప‌డిపోయింది.మ‌రి టీడీపీ ఓట‌మికి కార‌ణాలు ఏంటంంటే ప్ర‌ధానంగా స్థానిక నేత‌ల మీద ఉన్న వ్య‌తిరేక‌త‌నే అని తెలుస్తోంది.

ఈ వ్య‌తిరేక‌త ఉన్న వారే ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి అన్నీ తామై తిర‌గ‌డంతో క‌థ అడ్డం తిరిగిందని తెలుస్తోంది.

"""/"/ ఇలాంటి నేత‌ల‌ను దూరం పెట్టాల్సింది పోయి మ‌రీ చంద్ర‌బాబు, అండ్ లోకేష్ కావాల‌ని వీరినే ఏరికోరి ఎందుకు ముందు న‌డిపించారో లోక‌ల్ కార్య‌క‌ర్త‌ల‌కు అర్థం కావ‌ట్లేదు.

చంద్ర‌బాబు కావాల‌ని వీరి భుజాన బాధ్య‌త‌లు మోపితే చివ‌ర‌కు ఊహించ‌ని ఫ‌లితం వ‌చ్చింది.

గ‌తంలో కూడా చంద్ర‌బాబు కుప్పంకు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఇలాంటి వారిమీద కార్య‌క‌ర్త‌లు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా చంద్ర‌బాబు పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో వారి ఆగ‌డాలు ప్ర‌జ‌ల్లో తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త‌ను తీసుకొచ్చాయ‌ని చెబుతున్నారు.

రాబోయే కాలంలో అయినా చంద్ర‌బాబు వారిని మార్చేయాల‌ని కోరుతున్నారు త‌మ్ముళ్లు.లేక‌పోతే మాత్రం రాబోయే కాలంలో చంద్ర‌బాబుకు కూడా గెలుపు అవ‌కాశాలు త‌క్కువ‌వుతాయ‌ని చెబుతున్నారు.

అందరికీ నమస్కారం ! నేను క్రాంతి ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయిని