యూపీలో ఘోరం.. కన్న కూతురినే సజీవదహనం చేసిన తండ్రి.. ?
TeluguStop.com
ప్రస్తుత సమాజంలో నేరం చేయడం అంటే మరీ సులువుగా మారిపోయింది.ఒక జంతువు ప్రాణం ఎలా తీస్తారో మనుషుల ప్రాణాలు కూడా అంతకంటే సులువుగా, మనసులో ఎలాంటి బాధ లేకుండా తీస్తున్నారు.
అది కన్న వారు కానీ బయటి వారు కానీ వెనకా ముందు ఆలోచన చేయకుండా చంపేస్తున్నారు.
ఒక తండ్రి కూడా తన కూతురిని అత్యంత కిరాతకంగా చంపిన ఘటన హృదయాన్ని కలచివేస్తుంది.
ఆ వివరాలు చూస్తే.యూపీ, గోరఖ్‌పూర్ జిల్లాలోని, బెల్‌ఘట్ ప్రాంతానికి చెందిన రంజనా యాదవ్ వేరే మతానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది.
అయితే ఈ ప్రేమ వ్యవహారం నచ్చని రంజనా తండ్రి కైలాశ్ యాదవ్ ఆమెను మందలించాడు.
అయినా రంజనా మారకపోవడంతో, ఫిబ్రవరి 3న పథకం ప్రకారం రంజనను బయటకు తీసుకెళ్లి ఓ కాంట్రాక్టు కిల్లర్, యువతి అన్నయ్య, బావ సహాయంతో ఆ తండ్రి యువతి కాళ్లు, చేతులు కట్టేసి తన పై పెట్రోలు పోసి సజీవ దహనం చేశారు.
కాగా ఫిబ్రవరి 4వ తేదీన, ధంగట పోలీస్ స్టేషన్ పరిధిలో సగం కాలి ఉన్న యువతి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, సీసీ కెమెరాల ఆధారంగా యువతి తండ్రిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా కైలాశ్ యాదవ్ తన నేరాన్ని ఒప్పుకున్నాడట.
దీంతో కైలాశ్ కు సహకరించిన కుమారుడు, అల్లుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.కాగా కాంట్రాక్టు కిల్లర్ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఆ సమయంలో సినిమాలు వదిలేయాలనుకున్నాను.. అప్సరా రాణి కామెంట్స్ వైరల్!