కుక్కలు తరమడంతో ఏటీఎంలో దూరిన జింక.. బయటపడలేక ఇబ్బందులు

సోషల్ మీడియా విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చాక ఎన్నో ఆసక్తికర వీడియోలు కనిపిస్తున్నాయి.ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు బాగా దర్శనం ఇస్తున్నాయి.

కొన్ని సార్లు జంతువుల వీడియోలు నవ్వు పుట్టిస్తే కాబట్టి, కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి.

అవి చేసే అల్లరి పనులు భలే నవ్వు పుట్టిస్తుంటాయి.ఇక ఇటీవల కాలంలో అడవిలో ఉండాల్సిన జంతువులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి.

ఆహారం కోసం, నీటి కోసం మనుషులు ఉండే ప్రాంతాలకు వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

చివరికి కొన్ని సార్లు మనుషులపై దాడి చేస్తున్నాయి.కొన్ని జంతువులు మాత్రం మనుషుల చేతికి చిక్కి చనిపోతున్నాయి.

ఇలాంటి ఘటనల గురించి విన్నప్పుడు అయ్యో పాపం అనిపిస్తుంది.తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

గుజరాత్‌లో ఏటీఎంలో ఒక జింక చిక్కుకు పోయింది.బయటకు రాలేక ఇబ్బందులు పడింది.

దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. """/"/ గుజరాత్‌లోని ధారిలోని అమ్రేలిలో ఇటీవల ఆసక్తికర ఘటన జరిగింది.

ఓ జింకను కుక్కల గుంపు తరిమింది.కుక్కల నుంచి తప్పించుకునేందుకు ఆ జింక పరుగులు పెట్టింది.

చివరికి ఓ ఏటీఎం సెంటర్‌లోకి దూరి పోయింది.అయితే లోపల నుంచి బయటకు ఎలా రావాలో తెలియక తికమకపడింది.

ఈ ఘటనను స్థానికులు వీడియో రికార్డు చేశారు.ఏటీఎం నుంచి తప్పించుకోవడానికి చుట్టూ దూకడానికి జింక యత్నించింది.

కుక్కల గుంపు వెంబడించడంతో జింక ఏటీఎం లోపల ఇరుక్కుపోయిందని స్థానికులు పేర్కొన్నారు.స్థానికులు ఈ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు.

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు జింకను పట్టుకున్నారు.అక్కడి నుంచి తీసుకెళ్లి అటవీ ప్రాంతంలోకి వదిలారు.

వీడియో: రీల్స్ కోసం ఆటో వెనుక వేలాడుతూ స్టంట్స్‌ చేసిన యువకులు.. చివరికి..?