షన్ను కు తగిలేలా ఆ కామెంట్ చూపించిన దీప్తి సునైనా.. వైరల్ స్టోరీ?

సోషల్ మీడియా సెలబ్రెటీ దీప్తి సునయన.ఈమె గురించి సోషల్ మీడియా ప్రియులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఇక బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా బాగా దగ్గరయింది.

ఆ షోతో తన పరిచయాన్ని పూర్తిగా పెంచుకొని మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.హౌస్ లో ఉన్నంత కాలం బాగా అల్లరి చేస్తూ, ఎమోషనల్ తో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.

తోటి కంటెస్టెంట్లతో బాగా రచ్చ చేసింది.మొదట్లో డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో బాగా మెప్పించి మరింత గుర్తింపు అందుకుంది.

బిగ్ బాస్ లో అవకాశం అందుకోగా తన కెరీర్ మొత్తం బిగ్ బాస్ తో మొదలైందని చెప్పవచ్చు.

ఇక పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి మంచి సక్సెస్ లు అందుకుంది.

దీప్తి మరో సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ తో కలిసి పలు షార్ట్ ఫిలిమ్స్ లలో కూడా చేసింది.

వీరిద్దరూ కలిసి కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేశారు.ఇక వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ ఏర్పడింది.

దాంతో అది లవ్ గా మారింది.కానీ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొన్న షణ్ముఖ్ మితిమీరి ప్రవర్తించిన సంగతి తెలిసిందే.

దీంతో షన్ను తో తన రిలేషన్ కరెక్ట్ కాదని బ్రేకప్ చెప్పుకుంది. """/"/ ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

మొదట్లో బాగా ఎమోషనల్ అయిన దీప్తి ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉంది.ప్రస్తుతం పలు షార్ట్ ఫిలిమ్స్ తో పాటు పలు ప్రాజెక్టులలో కూడా బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

ఈమె చేసే డ్యాన్సులు చూస్తే మాత్రం మతి పోవాల్సిందే.తన నడుము అందాలతో తెగ స్టెప్పులు వేస్తూ అందర్నీ తన వైపు మలుపుకుంటుంది.

ఏదైనా కొత్త పాట వస్తే చాలు వెంటనే సందడి చేయకుండా ఉండదనే చెప్పాలి.

అప్పుడప్పుడు మనసుకు టచ్ అయ్యే కొటేషన్స్ పెడుతూ ఉంటుంది.అవి ఎవరిని ఉద్దేశించి పెడుతుందో కానీ అవి బాగా వైరల్ అవుతూ ఉంటాయి.

కానీ చాలామంది ఆమె షన్ను ని ఉద్దేశించే పెడుతుంది అని అనుకుంటుంటారు.అయితే తాజాగా తను ఏమోనే అనే వీడియో సాంగ్ చేయగా అది తాజాగా విడుదల అయ్యింది.

"""/"/ ఇక ఆ సాంగ్ క్షణాలో వైరల్ అవ్వగా ఓ రేంజ్ లో ఆ సాంగ్ కు ఫిదా అయ్యారు ప్రేక్షకులు.

ఇక యూట్యూబ్లో ఆ పాట ట్రెండింగ్ లో ఉంది.దీంతో ఆ పాటను చూసిన ప్రేక్షకులు బాగుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక ఓ అభిమాని ఆ పాట కాన్సెప్ట్ కు ఫిదా అయ్యి  ప్రేమించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటారో లేదో తెలియదు కానీ పెళ్లి చేసుకున్న వాళ్లు కచ్చితంగా ప్రేమించుకుంటారు అని కామెంట్ చేయగా ప్రత్యేకించి ఆ స్క్రీన్ షాట్ పంపుకుంది దీప్తి.

దీంతో ఆమె ఆ స్టోరీ పెట్టడంతో షన్నును ఉద్దేశించి పెట్టిందేమో అని కొందరు అనుమానపడుతున్నారు.

నవంబర్ 13న జో బైడెన్‌తో భేటీ కానున్న డొనాల్డ్ ట్రంప్