ఆ రోజు గురించి తలుచుకుంటే భయమేస్తుందంటున్న దీప్తి సునైనా.. వైరల్ స్టోరీ?

దీప్తి సునైనా గురించి సోషల్ మీడియా ప్రియులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే సోషల్ మీడియా స్టార్ గా తన పరిచయాన్ని బాగా పెంచుకుంది.అంతేకాకుండా మరో సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ గా కూడా అందరి దృష్టిలో పడింది.

ఇక ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.చాలావరకు తన సమయాన్ని సోషల్ మీడియాలోనే గడుపుతుంది.

మొదట్లో ఈమె డబ్స్మాచ్ వీడియోలు చేస్తూ అందరి దృష్టిలో పడి బాగా లైక్స్ సంపాదించుకుంది.

తర్వాత ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.యూట్యూబ్ లలో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ కూడా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఆ సమయంలోనే తనకు షణ్ముఖ్ జష్వంత్ తో పరిచయం ఏర్పడగా అతనితో కలిసి చాలా వీడియోస్ చేసింది.

వారిద్దరి మధ్య ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.ఇక ఆ సమయంలోనే దీప్తికి బిగ్ బాస్ లో అవకాశం రావడంతో బిగ్బాస్ లో అడుగు పెట్టింది.

ఆ సమయంలోనే షణ్ముఖ్ గురించి చాలా విషయాలు బయటకు పంచుకుంది.అప్పటినుంచి అందరిలో అనుమానాలు మొదలయ్యాయి.

ఆ తర్వాత దీప్తి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక యూట్యూబ్ లలో షార్ట్ వీడియోస్ చేస్తూ బాగా బిజీగా మారింది.

"""/"/ ఇక షణ్ముఖ్ తో కలిసి చాలా వీడియోస్ చేస్తూ బాగా సందడి చేసింది.

అంతేకాకుండా అతనితో కలిసి బుల్లితెరపై పలు షో లలో జంటగా కూడా పాల్గొంది.

అలా కొంతకాలం వీరిద్దరూ ప్రేమలో ఉండగా ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు.

తర్వాత షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టగా ఆ సమయంలో వారి మధ్య ప్రేమ ఉందన్న నిజం బయటపడింది.

కానీ షణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లో మరో అమ్మాయితో ప్రవర్తించిన తీరు పట్ల దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పేసింది.

ఇక వీరిద్దరూ ఎవరి లైఫ్ వాళ్ళు అన్నట్లుగా బ్రతుకుతున్నారు.అంతేకాకుండా ఇద్దరు తమ తమ ప్రాజెక్టులతో బాగా బిజీ అవుతున్నారు.

ఇక ఇటీవలే దీప్తి సునైనా కొత్త ఇల్లు నిర్మించుకున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా 'ఏమోనే' అనే షార్ట్ వీడియోలో కూడా చేయగా విడుదలకు సిద్ధంగా ఉంది.

"""/"/ ఇక తనకు ఖాళీ సమయం దొరికితే తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడుతుంది దీప్తి.

ఇక తాజాగా తన ఫాలోవర్స్ తో మరోసారి ముచ్చట్లు పెట్టింది.ఇక అందులో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది.

అయితే తనకు ఆ ఒక రోజు గురించి తలుచుకుంటే భయమేస్తుంది అంటూ తెలిపింది.

అదేంటంటే.ఓ అభిమాని బర్త్ డే కు డ్రెస్ కొన్నావా అంటూ ప్రశ్నించగా నో అని కడుపులో భయం అవుతుంది బర్త్డే అని చూస్తేనే అంటూ తెలిపింది.

ప్రస్తుతం ఆ స్టోరీ వైరల్ అవుతుంది.

సినిమా ఏదైనా పర్ఫామెన్స్ లో తగ్గేదేలే అంటున్న సత్యదేవ్ !