ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించిన దీపికా... యాక్టింగ్ స్కిల్స్ నచ్చుతాయంటూ కామెంట్స్!
TeluguStop.com
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగడమే కాకుండా ప్రభాస్ ప్రాజెక్ట్ కే చిత్రం ద్వారా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను కూడా సందడి చేయడానికి సిద్ధమైంది.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR చిత్రం ద్వారా హీరోగా ప్రేక్షకులను సందడి చేయబోతున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా ఇంకా విడుదల కాకుండానే ఈయనకు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.
ఈ క్రమంలోనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే ఎన్టీఆర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ.జూనియర్ ఎన్టీఆర్ నటన ఎంతో అద్భుతంగా ఉంటుందని ఆయన యాక్టింగ్ స్కిల్స్ తనకు బాగా నచ్చుతాయని ఎన్టీఆర్ నటన పై ప్రశంసలు కురిపించారు.
ఈ సందర్భంగా ఈమె ఎన్టీఆర్ గురించి ప్రశంసలు కురిపిస్తూ ఎన్టీఆర్ తో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని తనతో నటించే అవకాశం వస్తే వదులుకోనని తన మనసులో ఉన్న మాటను బయట పెట్టారు.
"""/"/
ఈ విధంగా నందమూరి హీరో గురించి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈ విధంగా ప్రశంసలు కురిపించడంతో అభిమానులు ఎంతో ఖుషి అవుతున్నారు.
అదే విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు బన్ని అన్నా కూడా చాలా ఇష్టమని, ఈ సందర్భంగా దీపికా పదుకొనే టాలీవుడ్ హీరో లపై ప్రశంసలు కురిపించారు.
ఇక ఈమె కోరుకున్న విధంగానే త్వరలోనే తారక్ తో కలిసి నటించే అవకాశం ఎప్పుడు వస్తుందో.
ఆ అవకాశం త్వరగా రావాలని ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నారు.
వీడియో వైరల్: చేపలు పట్టేందుకు సరికొత్త టెక్నిక్ వాడుతున్న యువకుడు.. మీరు ట్రై చేస్తారా..