దీపిక పిల్లి.. వెండితెర మీద కామెడీ అయ్యిందే..!

టిక్ టాక్ ద్వారా పాపులర్ అయ్యిన దీపిక పిల్లికి ఢీ యాంకర్ గా ఛాన్స్ ఇచ్చింది ఈటీవీ.

అయితే అక్కడ ఉంటే కొన్నాళ్లు సేఫ్ అయినా సరే స్టార్ మా నుంచి మంచి ఆఫర్ రాగానే అక్కడకి షిఫ్ట్ అయ్యింది దీపిక.

స్టార్ మా కామెడీ స్టార్స్ కి ఆమె వన్ అండ్ ఓన్లీ యాంకర్.

జబర్దస్త్ లో అనసూయ, రష్మిల మీద వేసినట్టుగానే కామెడీ స్టార్స్ లో దీపిక మీద కూడా పంచులు వేస్తుంటారు.

కామెడీ స్టార్స్ యాంకర్ క్రేజ్ తో వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్ గా కూడా నటించింది దీపిక పిల్లి.

ఆ సినిమాలో సుడిగాలి సుధీర్ కి జోడీగా దీపిక నటించింది.అయితే ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ అవకపోవడంతో మళ్లీ కామెడీ స్టార్స్ కొనసాగిస్తుంది.

పండుగాడ్ సినిమా హిట్ అవుద్ది తనొక బిజీ హీరోయిన్ అవుతానని అనుకున్న దీపికకు పెద్ద షాకే తగిలింది.

వాంటెడ్ పండుగాడ్ రిలీజై ఇన్నాళ్లు అవుతున్నా దీపికకి ఒక్క ఛాన్స్ కూడా రాలేదు.

దీపిక పిల్లి చేస్తున్న ఈ షోకి కూడా పెద్దగా రేటింగ్ రావట్లేదు.మరి దీపిక ప్లాన్ చేంజ్ చేసి వేరే దగ్గరకు వెళ్తుంద లేక ఇందులోనే కొనసాగుతుందా అన్నది చూడాలి.

హీరోయిన్ కి కావాల్సిన అన్ని క్వాలిటీస్ తనలో ఉన్నాయని ప్రూవ్ చేసుకునేందుకే అమ్మడు ఇన్ స్టాగ్రాం రీల్స్ లో రెచ్చిపోతుంది.

అవి స్టేటస్ లుగా పెట్టుకుని ఆడియన్స్ ని అలరిస్తుంది.ప్రస్తుతం అమ్మడికి సోషల్ మీడియాలో బాగానే ఫాలోయింగ్ ఉంది.

అల్లు, మెగా ఫ్యామిలీలు కలిసిపోయినట్టేనా.. ఈ కుటుంబాల మధ్య గ్యాప్ తగ్గుతుందా?