Deepika Padukone : దీపికా పదుకొణె తెలుగు డెబ్యూ మూవీ “కల్కి” కాదా.. ఆమె ఫస్ట్ మూవీ ఏంటంటే..
TeluguStop.com
తెలుగు చిత్రసీమలో బాలీవుడ్ అగ్ర తార దీపికా పదుకొణె( Deepika Padukone ) త్వరలోనే ఎంట్రీ ఇవ్వనుంది ఆమె ప్రభాస్‌తో కలిసి "కల్కి 2898 AD"( Kalki 2898 AD ) నాలో నటిస్తోంది.
ఇది ఒక పెద్ద భారీ బడ్జెట్ సినిమా.బాలీవుడ్ లో పఠాన్, జవాన్ సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ తెలుగు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది.
ఈ నేపథ్యంలోనే దీపిక కల్కి కంటే ముందే తెలుగులో ఒక సినిమా చేసిందనే సంగతి వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తెలుగు చిత్రసీమలోకి ఇంకా అడుగు పెట్టలేదని చాలామంది అనుకుంటున్నారు.
ఆమె మొదటి తెలుగు చిత్రం ప్రభాస్‌తో( Prabhas ) కలిసి "కల్కి" అని చాలా మంది నమ్ముతున్నప్పటికీ, అది నిజం కాదు.
"కల్కి" కంటే ముందు, దీపిక "లవ్ ఫర్ ఎవర్"( Love 4 Ever Movie ) అనే తెలుగు చిత్రంలో కొద్దిసేపు కనిపించింది.
దురదృష్టవశాత్తు, ఈ చిత్రం థియేటర్లలోకి రాలేదు.అందుకే ఈ అందాల తార తెలుగు ప్రేక్షకులకు ఇప్పటిదాకా పరిచయం కాలేదు.
అలానే ఆ సినిమా ఆమెకు టాలీవుడ్ డెబ్యూ కాలేదు.దీపిక తన మాతృభాష అయిన కన్నడలో "ఐశ్వర్య" సినిమాతో వెండితెరకు అరంగేట్రం చేసింది.
"""/" /
బ్లాక్ బస్టర్ చిత్రం "ఓం శాంతి ఓం"లో( Om Shanti Om ) షారుఖ్ ఖాన్ సరసన నటించిన తర్వాత ఆమె బాలీవుడ్‌లో విపరీతమైన పాపులారిటీ దక్కించుకుంది.
ఆమె "బాజీరావ్ మస్తానీ," "యే జవానీ హై దీవానీ," "రామ్ లీలా" వంటి సినిమాలతో సూపర్ డూపర్ హిట్స్ అందుకుంది దీని తర్వాత ఆమె బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
దీపిక అఫీషియల్ తెలుగు డెబ్యూ "కల్కి"లో ఉంటుంది, ఇది మే 9 న విడుదల కానుంది.
ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా దిశా పటాని కథానాయికగా నటిస్తోంది. """/" /
ఆసక్తికరంగా, మహాభారతం కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.
ఇటీవలే, ప్రభాస్, దిశా పటానిలపై మీద ఓ రొమాంటిక్ పాటను ఇటలీలో చిత్రీకరించారు.
"కల్కి" విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ కల్కి టీమ్ రెగ్యులర్ అప్ డేట్స్ అందించాలని భావిస్తున్నారు.
ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించే అంశంగా మారింది.ఈ తెలుగు సినిమా ఎలాంటి అద్భుతమైన కథతో వస్తుందో తెలుసుకోవాలని ప్రేక్షకులు బాగా కుతూహల పడుతున్నారు.
కన్నడ సినిమా నుండి బాలీవుడ్‌కి సాగిన దీపిక ప్రయాణం విశేషమైనది.ఆమె రాబోయే తెలుగు చిత్రం "కల్కి" అభిమానులలో సంచలనాన్ని సృష్టిస్తోంది.