ప్రభాస్ వెంటపడుతున్న దీపికా!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమా పూర్తిగాక ముందే తన నెక్ట్స్ మూవీని నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ కూడా చేశారు చిత్ర యూనిట్.అయితే ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఎవరు నటిస్తున్నారనే విషయంపై చాలా పేర్లు వినిపించినా చివరకు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేను ఈ సినిమాలో హీరోయిన్‌గా ఫిక్స్ చేశారు చిత్ర యూనిట్.

కాగా ఈ సినిమాను పూర్తి సూపర్ హీరో బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.

అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకుంది బాలీవుడ్ బ్యూటీ దీపికా.ఇక ఈ సినిమాలో ప్రభాస్‌తో తన ప్రయాణం సాఫీగా సాగుతుందని ఆమె ఆశిస్తున్నట్లు పేర్కొంది.

అయితే సోషల్ మీడియాలో చాలా తక్కవ మందిని ఫాలో అయ్యే ప్రభాస్, ఈ సినిమాలో దీపికా హీరోయిన్ అని తెలియగానే ఆమెను ఫాలో అవుతున్నాడు.

ఇది గమనించిన దీపికా కూడా ప్రభాస్‌ను ఫాలో అవుతుండటంతో ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇక భారీ బడ్జెట్ చిత్రంగా రానున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీ దత్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ప్రారంభించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం ఇంకొంత కాలం ఆగాల్సిందే.

హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు : కెనడా కోర్టు ఎదుట హాజరైన నాలుగో అనుమానితుడు