దీపిక వేసుకున్న ఈ బ్రేస్ లేట్ ధర ఎంతో తెలుసా.. లక్షలు కాదు కోట్లా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి దీపికా పదుకొనే( Deepika Padukone ) ఒకరు.

ఈమె బాలీవుడ్ సినిమాలలో మాత్రమే కాకుండా ఈమె నటించిన సినిమాలు తెలుగులో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

అయితే మొదటిసారి ఈమె తెలుగు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

డైరెక్టర్ నాగ్ అశ్విన్( Nag Ashwin ) దర్శకత్వంలో ప్రభాస్( Prabhas ) నటించిన కల్కి సినిమా( Kalki Movie ) ద్వారా ఈమె మొదటిసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల కానున్న సంగతి తెలిసిందే.

"""/" / ఈ సినిమా జూన్ 27 న విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో దీపికా పదుకొనే పాల్గొని సందడి చేశారు.

అయితే ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్నటువంటి ఈమె ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమానికి బ్లాక్ టైట్ అవుట్ ఫిట్ ధరించి ఈమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

"""/" / ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ గా మారాయి.

ఈ క్రమంలోనే దీపికా పదుకునే తన ఎడమ చేతికి వేసుకున్న డైమండ్ బ్రేస్ లేట్( Diamond Bracelet ) కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె వేసుకున్న ఈ బ్రేస్ లేట్ చూడటానికి చాలా సింపుల్ గా అనిపించిన ఖరీదు తెలిస్తే మాత్రం ఖంగు తినాల్సిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె ధరించిన ఈ డైమండ్ బ్రేస్లెట్ ఖరీదు ఏకంగా కోటి ₹16 లక్షల రూపాయలు అనే విషయం తెలియడంతో ఒక్కసారిగా నేటిజన్స్ షాక్ అవుతున్నారు.

ఈమె ధరించిన ఈ ఒక్క బ్రేస్ లేట్ అమ్మితే చాలు లైఫ్ మొత్తం సెటిల్ అవుతుంది అంటూ కామెంట్లో చేస్తున్నారు.

అయితే సెలబ్రిటీలు ఎలా ఖరీదైన వస్తువులు ధరించడం సర్వసాధారణమని చెప్పాలి.

వైరల్: అసలైన బాలయ్య అంటే ఇది.. అభిమానులతో కలిసి..