ప్రమోషన్స్ కోసం దీపిక అండ్ టీమ్ స్ట్రింగ్ ఆపరేషన్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ప‌దుకొనే తాజా చిత్రం చపాక్.ఈ చిత్రంలో దీపికా యాసిడ్ బాధితురాలి క్యారెక్టర్ చేసి అందరిని అలరిస్తుంది.

ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలక్షన్ ల వర్షం కురిపిస్తుంది.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం దీపిక వినూత్న రీతిలో చేస్తుంది.

సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ప్రమోషన్స్ లో బిజీ గా ఉంటున్న దీపిక దీనిలో భాగంగా దీపిక అండ్ టీమ్ ఓ స్ట్రింగ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించారు.

యాసిడ్ అమ్మకాల్లో జరుగుతున్న అవకతవకలపై నిజా నిజాలను నిరూపించాలని దీపిక అండ్ టీమ్ ఈ ఆపరేషన్ నిర్వహించింది.

అయితే యాసిడ్ బాటిల్ అమ్మకం విషయంలో వినియోగదారుల నిర్లక్ష్యం స్పష్టంగా అర్ధం అయ్యేలా దీపిక అండ్ టీమ్ తమ ఆపరేషన్ ను నిర్వహించింది.

సాధారణ మినరల్ వాటర్ బాటిల్ కొన్నంత తేలికగా యాసిడ్ బాటిల్ లభిస్తున్న వైనం చూసి టీమ్ సైతం ఆశ్చర్యపోయింది.

సాధార‌ణంగా యాసిడ్‌ కొనాలంటే కొనుగోలు చేసే వ్య‌క్తి గుర్తింపు కార్డు చూసి, అడ్ర‌స్ తీసుకోవాలి.

కానీ షాపు య‌జ‌మానులు అలాంటి నిబంధ‌న‌లను పాటించడం లేదని దీపికా పదుకొనే టీమ్ ఒక సామాజిక ప్రయోగం ద్వారా నిరూపించింది.

దీపిక తన టీమ్‌తో కలిసి మొత్తం 24 యాసిడ్ బాటిల్స్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.

సుప్రీం నిబంధ‌నలకు తూట్లు పొడుస్తున్న అమ్మకం దారుల నుంచి మొత్తం 24 యాసిడ్ బాటిల్స్ కొన్నామ‌ని చెప్పిన దీపిక త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో స్ట్రింగ్ ఆప‌రేష‌న్ వీడియోను కూడా పోస్ట్ చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.