చిన్న గ్రామం లో సువిశాల భవంతిని కొనుగోలు చేసిన బాలీవుడ్ క్యూట్ కపుల్స్..

బాలీవుడ్ బ్యూటీ కపుల్స్ ఎవరు అని అడిగితే.వెంటనే చెప్పే పేరు దీపికా పదుకొనే, రణ్ వీర్ సింగ్.

ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ స్టార్స్.హిందీ చలన చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ స్పెషల్ అట్రాక్షన్ గానే కనిపిస్తారు.

వరుస సినిమాలో ఈ జంట బాగా బిజీగా ఉన్నా.సమయం దొరికితే చాలా విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంటటారు.

రీల్ లైఫ్ తో పాటు రియల్ లైఫ్ కూ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు.

వ్యక్తిగత జీవితానికి కూడా సమయం కేటాయిస్తారు.ప్రస్తుతం ఈ బాలీవుడ్ జంట పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

ఎవరికి వారు వేర్వేరుగా పలు సినిమాలు చేస్తున్నారు.పలు యాడ్స్ లోనూ నటిస్తున్నారు.

క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు.అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ జంట బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తమ వ్యక్తిగత విషయాలను నెట్టింట్లో ఫేర్ చేస్తూ ఉంటారు.తాజాగా వీరిద్దరు ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు.

అదేంటంటే.మహారాష్ట్రాలోని ఓ చిన్న ఊళ్లో ఖరీదైన ఇల్లు కొనుగోలు చేశారట.

అలిబాగ్‏లోని మాప్‏గావ్ అనే గ్రామంలో ఈ ఇల్లు ఉందట.దాని ధర ఏకంగా రూ.

22 కోట్లట.ఈ ఇల్లు సుమారు 2.

25 ఎకరాల విస్తీర్ణంలో ఉందట.ఈ బంగళా ది ఎవర్ స్టోన్ గ్రూప్ చీఫ్ రాజేష్ జగ్గిదట.

"""/"/ సెప్టెంబర్ 13న ఈ ఇంటిని కొనుగోలు చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ చేసుకున్నారట దీపికా దంపతులు.

దీనికి గాను.కేవలం స్టాంప్ డ్యూటీ కోసమే రూ.

1.32 కోట్ల రూపాయలు చెల్లించారట.

ఈ విశాలమైన ఇంట్లో 5 బెడ్రూంలు ఉన్నాయట.ఈ ఇంటి నుంచి కిహిమా బీచ్ కు కేవలం 10 నిమిషాల్లో వెళ్లే అవకాశం ఉందట.

ఇప్పటికే అలిబాగ్ ప్రాంతంలో బాలీవుడ్ నటులకు పలు భవనాలు ఉన్నాయట.అదే ప్రాంతంలో ఈ జంట కూడా ఓ ఇల్లు కొనుగోలు చేయడం విశేషం.

మహాకుంభ్ మోనాలిసా సంచలనం.. 10 రోజుల్లో రూ.10 కోట్లు సంపాదించిన వైరల్ గర్ల్?