Richest Heroines: మన దేశంలో అత్యధిక ఆస్తులు కలిగి ఉన్న హీరోయిన్లు వీళ్లే.. ఎవరి ఆస్తి ఎంతంటే?
TeluguStop.com
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని అంటూ ఉంటారు.ఈ విషయం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు బాగా వర్తిస్తుందని చెప్పవచ్చు.
ఎందుకంటే మంచి ఫామ్ లో ఉన్నప్పుడే సినిమాలలో నటించడంతోపాటు భారీగా డబ్బులు వెనకేసుకోవాలి.
లేదంటే ఒక్కసారి అవకాశాలు తగ్గిపోవడం మొదలైతే మళ్లీ అవకాశాల కోసం నాన అవస్థలు పడాల్సి ఉంటుంది.
అయితే సినిమా ఇండస్ట్రీలో అలా మంచి ఫేమ్ ఉన్న సమయంలో యాడ్స్ లో సినిమాలలో బాగా నటించి చాలామంది హీరోయిన్లు కోట్లు సంపాదించారు.
అటువంటి వారిలో టాప్ 10 హీరోయిన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.బాలీవుడ్ లో భారీగా సంపాదిస్తున్న హీరోయిన్లలో ఐశ్వర్యారాయ్ బచ్చన్( Aishwarya Rai Bachchan ) అగ్రస్థానంలో ఉంది.
"""/" /
ఈమె ఒక్కొక్క సినిమాకు 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ ను అందుకుంటోంది.
యాడ్స్ రూపంలో 7 నుంచి 8 కోట్ల వరకు సంపాదిస్తోంది.అలా భారీగా వెనకేసుకుంది ఐశ్వర్య.
ఇక ఆమె ఆస్తి విలువ 800 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.ఐశ్వర్య రాయ్ తర్వాత రెండవ స్థానంలో ప్రియాంక చోప్రా( Priyanka Chopra ) ఆ స్థానాన్ని దక్కించుకుంది.
ప్రస్తుతం బాలీవుడ్ ని వదిలేసి కేవలం హాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన ప్రియాంక చోప్రా సినిమాలో యాడ్స్ రూపంలో కోట్లను సంపాదిస్తోంది.
ఇవేకాకుండా పలు రకాల బిజినెస్ లు కూడా చేస్తుంది ప్రియాంక చోప్రా.అలా ప్రియాంక చోప్రా ఆస్తుల విలువ దాదాపు 600 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.
ఇక లిస్ట్ లో మూడవ స్థానంలో ఆలియా భట్( Alia Bhatt ) నిలిచింది.
ఆలియా ఒక్కో సినిమాకు రూ.9 నుంచి 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నది.
"""/" /
ఆలియా భట్ రీసెంట్‌గా ఎడ్ ఎ మమ్మా అనే క్లాతింగ్ బ్రాండ్‌ను కూడా ఓపెన్ చేసింది.
ఈ సంస్థ టర్నోవర్ రూ.150 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.
ఎటర్నల్ సన్‌షైన్ పేరుతో నిర్మాణ సంస్థను కూడా రన్ చేస్తున్నది.అలాగే డ్యూరోఫ్లెక్స్, ఎవర్, క్యాడ్‌బరీ, క్వాలిటీవాల్స్, కార్నెటో, ఫ్రూటీ వంటి బ్రాండ్లకు సంబంధించిన అడ్వర్టయిజ్‌మెంట్ల రూపంలోనూ బాగానే సంపాదిస్తున్నది.
ఇలా దాదాపు 550 కోట్ల వరకు కూడబెట్టిందట.ఇక నాలుగో స్థానంలో దీపికా పదుకొనె ఉంది.
సినిమాలు, యాడ్స్ రూపంలో దీపికా( Deepika Padukone ) కూడా ఎక్కువగా సంపాదించింది.
బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో దీపిక ముందుంటుంది.ఒక్కో సినిమాకు రూ.
25 నుంచి 30 కోట్ల వరకు పారితోషికం అందుకుంటోంది. """/" /
ఏషియన్ పెయింట్స్, లాయిడ్, జాగ్వర్, జియో, లోరియల్, తనిష్క్, కొకా కోలా వంటి కంపెనీలతో ఈమెకు ఒప్పందాలు ఉన్నాయి.
అలాగే 82E అనే సౌందర్య ఉత్పత్తుల కంపెనీ కూడా ఉంది.దీపిక పదుకోన్ ఆస్తుల విలువ దాదాపు 500 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా.
సంపన్న కథానాయికల్లో కరీనా కపూర్ ఖాన్( Kareena Kapoor Khan ) ఐదో స్థానంలో నిలిచింది.
ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నది.
ఒక్కో అడ్వర్టయిజ్‌మెంట్‌కు రూ.6కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నది.
అలాగే స్టేజ్ షోలు, రేడియో షోల రూపంలోనూ భారీగానే సంపాదిస్తున్నది. """/" /
కరీనా ఆస్తుల విలువ రూ.
485 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా.ఆరో స్థానంలో ఉన్న కత్రినా కైఫ్( Katrina Kaif ) ఒక్కో సినిమాకు రూ.
7-8 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నది.ఒక్కో యాడ్‌కు రూ.
7కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నది.ఇక కత్రినాకు చెందిన బ్యూటీ ప్రొడక్ట్ బ్రాండ్ కాయ్ బ్యూటీ ద్వారా ఏడాదికి రూ.
100 కోట్ల వరకు సంపాదిస్తున్నది.ఆమె నికర ఆస్తుల విలువ రూ.
264 కోట్లు ఉంటుందని సమాచారం.రూ.
255 కోట్లతో అనుష్క శర్మ( Anushka Sharma ) ఏడో స్థానంలో, రూ.
250 కోట్లతో మాధురీ దీక్షిత్ 8వ స్థానంలో, రూ.235 కోట్లతో కాజోల్ 9వ స్థానంలో, రూ.
206 కోట్లతో రాణి ముఖర్జీ 10వ స్థానంలో ఉన్నారు.
చిరంజీవి శ్రీకాంత్ ఓదెల సినిమాలో నటించనున్న యంగ్ హీరో…