ఓటీటీల గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన దీపికా.. ఏమన్నారంటే?

ఒకానొక సమయంలో సినిమా అంటేనే థియేటర్లో విడుదల అయ్యి ప్రేక్షకులను సందడి చేసేది.

కరోనా పుణ్యమా అంటూ ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోంది.ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలో థియేటర్ లో విడుదలైన అనంతరం ఓటీటీలలో విడుదల అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.

అదే విధంగా మరికొన్ని సినిమాలు ఏకంగా ఓటీటీలలో విడుదల అవుతున్నాయి.ఇలా సినిమాలన్నీ ఓటీటీలలో విడుదల కావటం వల్ల థియేటర్ వ్యవస్థ దెబ్బతింటుందని పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రస్తుతం 75వ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ లో పాల్గొన్న బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే ఈ కార్యక్రమంలో సందడి చేశారు.

అనంతరం ఈ కార్యక్రమంలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో భాగంగా ఈమెకు ఓటీటీల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

ఓటీటీ వల్ల సినీపరిశ్రమకు ముప్పు ఉంటుందా అనే ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు దీపిక ఆసక్తికరమైన సమాధానం చెప్పారు.

"""/"/ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొందరు సినిమాలను థియేటర్లో చూడటానికి ఇష్టపడితే, మరికొందరు ఓటీటీలలో చూడటానికి ఇష్టపడతారు.

ఈ విధంగా రెండు రకాల ప్రేక్షకులు ఉంటారని ఈమె తెలిపారు.ఇకపోతే కొన్ని రకాల కథలను కొత్త తరహాలో ఓటీటీల ద్వారా ప్రేక్షకులకు చూపించవచ్చు.

ఈ విధంగాఓటీటీలకు సినిమాలు చేస్తే తప్పకుండా ఆ కథలో కొత్తదనం చూపించాలి కనుక ఇలాంటి కొత్తదనం పరిశ్రమకు ఎంతో మంచి చేస్తుంది దీని వల్ల సినీ పరిశ్రమ కు ఎలాంటి నష్టం ఉండదనేది నా అభిప్రాయం అంటూ ఈమె ఓటీటీల గురించి ఆసక్తికరమైన సమాధానం వెల్లడించారు.

హీరోయిన్ సాయిపల్లవి మొటిమలకు సర్జరీ చేయించుకున్నారా.. ఆమె జవాబు ఇదే!