రణబీర్ ను దీపికా ఇంకా మర్చిపోలేదా... అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుందా?

బాలీవుడ్ ప్రేమపక్షులుగా ఉన్నటువంటి రణబీర్ కపూర్ అలియా భట్ గత కొంత కాలం నుంచి ప్రేమలో ఉండి నేడు పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు.

ఇప్పటికే వీరి ఫ్రీ వెడ్డింగ్ వేడుక, మెహందీ ఫంక్షన్ ఎంతో ఘనంగా జరిగాయి.

ఇక ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు వీరి ఫ్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరయ్యారు.

ఈ క్రమంలోనే వీరి పెళ్లికి హాజరవుతున్న పలువురు ప్రముఖుల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఒక విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

రణబీర్ కపూర్ అలియా ప్రేమలో పడక ముందు మరొక నటి దీపికా పదుకొనేతో ప్రేమ వ్యవహారం నడిపారు.

అప్పట్లో వీరిద్దరీ వ్యవహారం చాలా దూరం వరకు వెళ్ళింది.ఇకపోతే వీరిద్దరి మధ్య విభేదాలు రావడం వల్ల లవ్ బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు.

ఈ క్రమంలోనే దీపికా పదుకొనే రణవీర్ సింగ్ ప్రేమలో పడి అతనితో మూడు ముళ్ళు వేయించుకొని వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు.

"""/"/ దీపికాతో లవ్ బ్రేకప్ అయిన తర్వాత రణబీర్ అలియా ప్రేమలో పడ్డారు.

ఇలా కొంతకాలం నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట నేడు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు.

ఈ క్రమంలోనే వీరి వివాహానికి దీపికా హాజరు కాకుండా ఆమె విదేశాలకు వెళ్లారు.

అయితే గతంలో కత్రినాకైఫ్ విక్కీ కౌశల్ వివాహానికి కూడా ఈమె హాజరు కాకుండా విదేశాలలో ఉండడం గమనార్హం.

ప్రస్తుతం ఆలియా రణబీర్ వివాహానికి కూడా దీపిక పక్కా ప్లాన్ ప్రకారమే విదేశాలకు వెళ్లిందని, రణబీర్ ను మర్చిపోలేక ఆమె విదేశాలకు వెళ్ళింది అంటూ పలువురు పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

అయితే దీపికా అభిమానులు మాత్రం నటిగా ఆమె ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలో తన షెడ్యూలు ప్రకారం తను విదేశాలకు వెళ్ళి ఉంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.