తండ్రి స్నాక్స్ అమ్మేవారు.. కూతురు ఐఏఎస్.. ఈ యువతి సక్సెస్ స్టోరీకి గ్రేట్ అనాల్సిందే!

కష్టపడి చదివితే ఉన్నతమైన లక్ష్యాలను సాధించడం సులువు అవుతుందనే సంగతి తెలిసిందే.ఒకవైపు పేదరికంతో పోరాడుతోనే మరోవైపు లక్ష్యాన్ని సాధించి దీపేష్ కుమారి( Deepesh Kumari ) సక్సెస్ సాధించారు.

ఎన్నో అవరోధాలను ఎదుర్కొని సివిల్స్ పరీక్షలో( UPSC Civils ) జాతీయ స్థాయిలో 93వ ర్యాంక్ ను ఆమె సాధించడం గమనార్హం.

స్నాక్స్ అమ్మే చిరు వ్యాపారి కూతురు జాతీయ స్థాయిలో సక్సెస్ సాధించి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.

రాజస్థాన్ రాష్ట్రంలోని( Rajasthan ) ఆటల్ బ్యాండ్ ప్రాంతానికి చెందిన చిరు వ్యాపారి కూతురు అయిన దీపేష్ కుమారి కుటుంబంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ సత్తా చాటారు.

చదువు విషయంలో తండ్రి గోవింద్ సపోర్ట్ ఉండటంతో కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎక్కారు.

గోవింద్ ఐదుగురు సంతానంలో దీపేష్ కుమారి పెద్ద అమ్మాయి కాగా శిశు ఆదర్శ్ విద్యామందిర్ లో ఆమె పాఠశాల విద్యను పూర్తి చేశారు.

"""/" / పదో తరగతిలో 98 శాతం, ఇంటర్ లో 89 శాతం మార్కులు సాధించిన దీపేష్ కుమారి ఐఐటీ బాంబేలో( IIT Bombay ) ఎంటెక్ పూర్తి చేశారు.

రెండో ప్రయత్నంలో దీపేష్ కుమారి సక్సెస్ అయ్యారు.కుటుంబ సభ్యుల సహకారం వల్లే సక్సెస్ సొంతమైందని ఆమె కామెంట్లు చేశారు.

దీపేష్ కుమారి కెరీర్ పరంగా సక్సెస్ సాధించిన తర్వాత కూడా తండ్రి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.

దీపేష్ కుమారి సక్సెస్ స్టోరీ ప్రత్యేకం అని చెప్పవచ్చు. """/" / దీపేష్ కుమారి సోదరీమణులు సైతం మంచి ర్యాంక్ సాధించి కెరీర్ పరంగా ముందడుగులు వేస్తున్నారు.

దీపేష్ కుమారి తమ్ముళ్లు, చెల్లెళ్లు కూడా కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని నెటిజన్లు భావిస్తున్నారు.

దీపేష్ కుమారి తనలా ఐఏఎస్( IAS ) కావాలని కష్టపడుతున్న వాళ్ల కోసం తన వంతు సహాయం చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ ఐదు రకాల వ్యక్తులు అంజీర్ తింటే లాభాలే లాభాలు..!