దీప అమావాస్య రోజు ఇలా చేస్తే శ్రావణ లక్ష్మి.. సంతోషంగా మీ ఇంటికి వస్తుంది..!

ఆషాడ అమావాస్య అనేది ఆషాడ మాసం చివరి రోజు వస్తుంది.శ్రావణమాసం లక్ష్మీదేవికి( Lakshmi Devi ) ఎంతో ప్రీతి పాత్రమైన మాసం.

శ్రావణ లక్ష్మికి స్వాగతం పలుకుతూ ఈ రోజున పండుగ చేస్తారు.ఈ పండుగ దీప అమావాస్య.

( Deepa Amavasya ) అంతేకాకుండా పితృదేవతలను కూడా సంతృప్తి పరిచేందుకు ప్రత్యేక దీపం వెలిగిస్తారు.

ఆషాడ అమావాస్యను దీపా అమావాస్యగా పరిగణిస్తారు.ఈ రోజున ఇంట్లో ముగ్గులతో అలంకారం చేసి దీపాలు వెలిగిస్తారు.

ఈ రోజు చేసే పూజలలో పిండి దీపాన్ని భగవంతునికి సమర్పిస్తారు.ఈ పండుగను తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రల్లో విశేషంగా చేస్తారు.

"""/" / ప్రతి అమావాస్యకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది.ఆషాడం తర్వాత వచ్చే శ్రావణ లక్ష్మికి స్వాగతం పలుకుతూ ఆషాడం అమావాస్య రోజు దీపం వెలిగించడం చాలా ముఖ్యం.

ఈరోజున సబ్జ పిండి లేదా గోధుమపిండితో చేసిన దీపం వెలిగించాలి.ఈ దీపాన్ని దక్షిణం వైపు వెలిగించి పెట్టడం ఎంతో మంచిది.

పితృదేవతలకు ( Ancestors ) సమర్పించేందుకు ఈ దీపం వెలిగిస్తారు.ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం జూలై 16వ తేదీన రాత్రి 10 గంటలకు అమావాస్య తిధి మొదలవుతుంది.

జూలై 17న అమావాస్య రోజు సూర్యోదయం జరుగుతుంది. """/" / కాబట్టి జూలై 17న దీపా అమావాస్య జరుపుకోవాలి.

జూలై 17న అర్ధరాత్రి 12 గంటలకు అమావాస్య ముగుస్తుంది.ఈ ఆషాడ అమావాస్య( Ashada Amavasya ) సోమవారం రోజున వస్తున్నందున దీన్ని సోమావతి అమావాస్య అవుతుంది.

ఈ అమావాస్యను ఇంట్లోనే దీపాలను శుభ్రం చేసి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి శుభ్రమైనవసరంపరచి దానిమీద దీపం ఉంచాలి.

దీపం నువ్వుల నూనె లేదా నెయ్యితో ఈ దీపాన్ని వెలిగించాలి.దీపానికి నైవేద్యం, పూలు సమర్పించాలి.

దీపావళి రోజున చేసినట్లుగానే ఇంటిని దీపాలతో అలంకరించాలి.ఈ రోజున పితృదేవతలను తలుచుకున్న, గౌరీవ్రతం చేసుకున్న దీప పూజ చేసుకున్న మంచి ఫలితం ఉంటుందని శాస్త్రం చెబుతుంది.

విచిత్రం! మహిళల లోదుస్తులు ఎత్తుకెళ్తున్న దొంగ.. చివరికి?