ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే దీక్ష..: బండి సంజయ్

తెలంగాణలో నేతన్నలు చేస్తున్న పోరాటాలతో కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Govt ) దిగొచ్చిందని బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్( Bandi Sanjay ) అన్నారు.

ఎన్నికల కోడ్ ముగిసే సమయంలోపు నేతన్నల డిమాండ్లు అన్నింటినీ పరిష్కరించాల్సిందేనని డిమాండ్ చేశారు.

ఈ మేరకు ప్రభుత్వం మెడలు వంచైనా సరే హామీలు అన్నింటినీ అమలు చేయిస్తామని తెలిపారు.

అవసరం అయితే ఎన్నికల కోడ్( Election Code ) ముగిసిన వెంటనే దీక్షకు దిగుతామని బండి సంజయ్ వెల్లడించారు.

వర్కర్ టు ఓనర్ పథకాన్ని కొనసాగించాలన్న ఆయన నేతన్న బీమా పథకం వయో పరిమితిని పెంచాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల దీక్ష .. పెరుగుతోన్న ప్రవాస భారతీయుల మద్ధతు