కోరిక కాదన్నాను కాబట్టే ధన్ రాజ్ బిగ్ బాస్ లో పగబట్టాడు – దీక్ష ఆరోపణ
TeluguStop.com
బిగ్ బాస్ ఇంట్లో ఉన్నంత సేపు కామ్ గా, సైలెంట్ గా ఉన్న దీక్ష పంత్, ఇంటిని వీడుతున్నప్పుడు మాత్రం వాయిలేంట్ గా హౌజ్ మేట్స్ అందరిపై విరుచుకుపడిన సంగతి మీకు తెలిసిందే.
కేవలం ఆదర్శ్ ని తప్ప ఎవరిని వదలని దీక్ష, కొత్తగా ధన్ రాజ్ మీద సంచలన ఆరోపణలు చేసింది.
బిగ్ బాస్ మొదటి సీజన్ లో తన ప్రయాణం ముగిసిన తరువాత జోరుగా మీడియాతో ముచ్చటిస్తున్న బిగ్ బాస్ మేకర్స్ ని కూడా తప్పుబట్టడం విశేషం.
బిగ్ బాస్ మేకర్స్ తనని ప్రజలకి తప్పుగా చూపించారు, రోజు మొత్తాన్ని గంటలో చూపించే బిగ్ బాస్ ఎడిటర్స్ తానూ చేసిన మంచి పనులు, యాక్టివ్ గా ఉన్న క్షణాలు ఏవి ప్రజలకి చూపించకుండా, తానూ ఏడుస్తున్నప్పుడు లేదా తింటున్నప్పుడు ఉండే ఫుటేజ్ ని మాత్రమె హైలెట్ చేసారు, అందుకే ప్రజలు తనని తప్పుగా అర్థం చేసుకొని ఎలిమినేట్ చేసారని దీక్ష అభిప్రాయపడింది.
ఇక కామేడియన్ ధన్ రాజ్ బిగ్ బాస్ ఇంట్లో తనని టార్గెట్ చేయడంపై స్పందిస్తూ, బంతిపూల జానకి అనే సినిమా చేస్తున్నప్పుడు ధన్ రాజ్ తనతో తేడాగా ప్రవర్తించేవాడని, సాయంత్రాలు కలుద్దాం అనేవాడు, షూటింగ్ ప్యాక్ అప్ చెప్పాకా, తనతో టైం స్పెండ్ చేయమనేవాడు, కాని తానెప్పుడు ధన్ రాజ్ ప్రపోజల్ ని ఒప్పుకోలేదని, తన మాటలను పట్టించుకునేదాన్ని కాదని, అవన్నీ దృష్టిలో పెట్టుకొనే ధన్ రాజ్ బిగ్ బాస్ ఇంట్లో తనని టార్గెట్ చేసాడని, తన గురించి నెగెటివ్ గా ప్రాజెక్ట్ అయ్యేలా చేసాడని దీక్ష ఆరోపించింది.
నాకు రాజకీయాలు తెలియవు.. ‘మా’ని నేను కోరేది అదొక్కటే.. పూనమ్ కామెంట్స్ వైరల్!