ఆ టీమ్ ఎఫెక్ట్ ... .సాయిరెడ్డి హవా తగ్గిందా ?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తర్వాత ఆ స్థాయిలో కీలక నాయకుడిగా విజయసాయిరెడ్డి వ్యవహరించేవారు.

పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఆయన హవా నడిచేది.జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా, దాని వెనుక ఖచ్చితంగా విజయసాయిరెడ్డి ఉండేవారు.

దీంతో పార్టీ నాయకులు ఆయనకు అంతే స్థాయిలో గౌరవం ఇచ్చే వారు.ఎవరు ఏ పదవి పొందాలి అన్నా, ఎవరు జగన్ ను కలవాలి అన్నా, విజయసాయిరెడ్డి ఆశీస్సులు ఉంటేనే సాధ్యం అయ్యేది.

కానీ కొంత కాలంగా వైసీపీలో విజయసాయిరెడ్డి ప్రాధాన్యం తగినట్టుగానే కనిపిస్తోంది.ఆయన స్థానంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి యాక్టివ్ అయ్యారు.

పార్టీ ప్రభుత్వం తరఫున ఏ విషయం పై మాట్లాడాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే ముందుకు వస్తున్నారు.

విజయసాయిరెడ్డి కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతం లో వైసీపీ బాధ్యతలు వరకు మాత్రమే పరిమితం అయ్యారు.

ఢిల్లీలోనూ వైసీపీ తరఫున అన్ని వ్యవహారాలను విజయసాయిరెడ్డి చక్కబెట్టినా, ప్రస్తుతం ఎంపీ మిథున్ రెడ్డి ఆ బాధ్యతలను చూస్తున్నారు.

ఈ పరిణామాలతో కాస్త కలత చెందిన విజయసాయిరెడ్డి సైలెంట్ అయిపోయినట్టుగా వ్యవహరిస్తున్నారు.అలాగే ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ పదవి విరమణ చేయడంతో, ఆయనను ప్రభుత్వ సలహాదారుగా జగన్ నియమించారు.

దీంతో విజయసాయి ఢిల్లీ పెత్తనానికి బ్రేక్ పడింది.ఈ వ్యవహారాలు ఇలా సాగుతుండగానే ఏపీలో వైసీపీ బాధ్యతలన్నీ ప్రశాంత్ కిషోర్ టీమ్ చూస్తోంది.

కీలక నిర్ణయాలు అన్నీ ఆ టీమ్ చూడబోతోంది. """/"// నాయకుల పనితీరుతో పాటు, పార్టీ ఏ కార్యక్రమాలతో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంలోనూ పీకే టీమ్ సలహాల మేరకే జగన్ నడుచుకోబోతున్నారు.

దీంతో విజయసాయిరెడ్డి కి పెద్దగా పని లేనట్టుగా అయిపోయింది.కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతంలో పార్టీ కార్యక్రమాలను చూసుకునే బాధ్యత మాత్రమే ఆయన పై పడింది.

ఈ పరిణామాలతో ఆయన ప్రాధాన్యం బాగా తగ్గడంతో ఉత్తరాంధ్ర ప్రాంతం నాయకులు ఇప్పుడు విజయసాయి రెడ్డి మాట వింటారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఎందుకంటే గతంలో ఈ ప్రాంత ఎమ్మెల్యే తో విజయసాయికి విబేధాలు ఉన్నాయి.ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా బహిరంగంగానే గళం విప్పారు.

ఇక ఇప్పుడు ఆయనకు ప్రాధాన్యం తగ్గింది అనే సంకేతాలు వెలువడటంతో, ఆయన మాట ఎంతమంది వింటారు అనేది సందేహంగానే మారింది.

నేను ఎవరికి భయపడే టైపు కాదు : వనిత విజయ్ కుమార్ కూతురు