పాల పొంగులా చల్లారిపోతున్న జనసేన ఇమేజ్ ?
TeluguStop.com
తన వరాహి యాత్రలతో ఆంధ్రప్రదేశ్లో తామే అసలైన ప్రతిపక్షమన్న స్థాయిలో బిగ్ సౌండ్ చేసిన జనసేన ఇమేజ్ రోజురోజుకి తగ్గిపోతుందా? అంటే అవుననే సమాదానం వినిపిస్తుంది.
దీనికి కారణం ప్రజల్లో పార్టీ పట్ల అభిమానం తగ్గటం కాదని జనసేన( Jana Sena ) వ్యూహాత్మక వైఫ్యల్యాలే ఆ పార్టీని ప్రజల్లో మసక బారెలా చేస్తున్నాయన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
ముఖ్యంగా అసలు బలం లేని తెలంగాణలో పోటీకి నిలబెట్టడం అతిపెద్ద వ్యూహాత్మక పొరపాటు కింద చూస్తున్న విశ్లేషకులు పైగా దానిలో నామమాత్రపు ప్రచారం తో సరిపెట్టడం .
పూర్తిగా దృష్టి పెట్టే ఉద్దేశం లేనప్పుడు అసలు పోటీకి ఎందుకు నిలబెట్టారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.
ప్రచారం లో పవన్ వైఖరి కూటమి పార్టీల తరఫున ప్రచారం చేసినట్లే ఉంది తప్ప , సొంత పార్టీ అభ్యర్థి తరపున ప్రచారం చేస్తున్నట్టు లేదని ,పార్టీ తరపున వ్యూహాత్మకమద్దత్తు కూడా పోటీ చేసిన అభ్యర్ధులకు జనసేన ఏమి ఇవ్వలేదని , అభ్యర్థుల భుజాలపైనే గెలుపు బాధ్యతలు మోపడంతో, ధన బలం లేని అభ్యర్థులు చాలా చోట్ల డిపాజిట్లు కూడా దక్కించలేకపోయినట్లుగా తెలుస్తుంది.
"""/" / అంతేకాకుండా ఆంధ్రా ఎన్నికలకు( Andhra Elections ) సంబందించి కూడా పూర్తిగా తెలుగుదేశం అధినేత నిర్ణయాలపైనే ఆధారపడుతున్నట్టుగా కనిపించడం పొత్తులపై విరుద్ద అభిప్రాయాలు ఉన్న జనసేన నేతలను పార్టీ మారిపోవచ్చు అని కూడా హెచ్చరించడం వంటివి చూస్తుంటే జనసేన తెలుగుదేశానికి పూర్తిస్థాయిలో బి టీం గా మారిపోయిందన్న వాతావరణం కనిపిస్తుంది.
ఇది జనసేన హార్డ్ కోర్ అభిమానులతో పాటు జనసేనకు అవుట్ అండ్ రైట్ మద్దతు ఇస్తున్న ఒక సామాజిక వర్గానికి కూడా అసంతృప్తి కలిగిస్తున్నట్లు తెలుస్తుంది.
తెలుగుదేశం ( TDP )దయతలచి ఇచ్చే సీట్లను తీసుకోవటమే తప్ప ఎటువంటి డిమాండ్ చేయకూడదు అన్నట్లుగా జనసేనాని వైఖరి ఉన్నదని పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో జనసేనాని చేసిన హెచ్చరికలు కూడా ఇందుకు ఊతం ఇస్తున్నాయన్నది కొంతమంది వాదన .
"""/" /
ఇలా తన వారాహి యాత్రలతో తెచ్చుకున్న ప్రభంజనాన్ని పవన్( Pawan Kalyan) పాల పొంగులా చల్లార్చేశారని కూడా కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మరి ఎన్నికలకు ఇంకా తక్కువ సమయం ఉన్నందున పూర్తిస్థాయిలో మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారే స్థాయికి జనసేన నిలబడగలదా లేదా అన్నది ప్రశ్న గా మారింది
.
వైరల్ వీడియో: అరె ఏంట్రా ఇది.. పళ్లతో అంత బరువుని ఎలా ఎత్తేశావ్?