పోటీపై త్వరలోనే నిర్ణయం..: కొణతాల రామకృష్ణ
TeluguStop.com
ఈనెల 21 వ తేదీన అనకాపల్లిలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లు కొణతాల రామకృష్ణ తెలిపారు.
కార్యకర్తలతో సమావేశం అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని పేర్కొన్నారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో స్టీల్ ప్లాంట్, పోలవరం, సుజల స్రవంతి, ఉత్తరాంధ్ర అభివృద్ధి అంశాలపై చర్చించానని తెలిపారు.
ఈ క్రమంలోనే తాను ఏ పార్టీలో చేరేది త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు.అదేవిధంగా పోటీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.