తెలంగాణ హైకోర్టుకు చేరిన హోంగార్డు రవీందర్ మృతి కేసు
TeluguStop.com
హైదరాబాద్ లో హోంగార్డు రవీందర్ మృతి కేసు తెలంగాణ హైకోర్టుకు చేరింది.రవీందర్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ హోంగార్డు జేఏసీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ఈ మేరకు హైకోర్టులో హోంగార్డు జేఏసీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
రవీందర్ మృతితో జేఏసీ సభ్యులను సైతం పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే హోంగార్డు జేఏసీ అధ్యక్షుడు నారాయణ కనిపించడం లేదన్న హోంగార్డు జేఏసీ ఆయన ఆచూకీ తెలపాలని కోరింది.
అదేవిధంగా మృతుడు రవీందర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.మరోవైపు రవీందర్ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడిని వేధించారన్న ఆరోపణల నేపథ్యంలో ఏఎస్ఐ నర్సింగరావు, కానిస్టేబుల్ చందుపై కేసులు పెట్టారని సమాచారం.
14 గంటలకు పైగా పని గంటలు ఉండాల్సిందే .. ఈ అమెరికన్ సీఈవోది నారాయణ మూర్తి బాటే