గేదెకు దశదిన కర్మ చేసి అన్నదానం చేసిన రైతు!

చాలామందికి జంతువులు అంటే చాలా ఇష్టం.పలు రకాల జంతువులను పెంచుకుంటారు.

వాటికి ఏమైనా హాని కలిగితే తట్టుకోలేక పోతారు.వాటికి ఏదైనా అనారోగ్యం కలిగితే ఖర్చులకు వెనుకాడకుండా మరి వాటిని కాపాడుకుంటారు.

ఇలాగే ఓ చోట ఓ వ్యక్తి తన గేదె పై ఉన్న ప్రేమతో దశదిన చేసిన సంఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ఇటీవలే ఓ కుటుంబం తన పెంపుడు పిల్లి కి సీమంతం చేసిన విషయం అందరికి తెలిసిందే.

కాగా యూపీలోని మహమ్మద్ షాకిస్త్ గ్రామానికి చెందిన సుభాష్.తను వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తాడు.

కాగా అతను 32 ఏళ్లు ఓ గేదెను పెంచుకునే వాడు.కాగా ఇటీవలే అది అనారోగ్యంతో మృతి చెందింది.

ఆ గేదె కు దశదినకర్మ చేయగా దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

"""/"/ గత కొన్ని రోజుల నుంచి ఆ గేదె అనారోగ్యంతో బాధ పడగా.

దాన్ని వైద్యానికి కావలసినంత ఖర్చు చేశారు.కానీ ఆ గేదెను కాపాడుకోలేక పోయాడు.

దాంతో అది మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు ఎంతగానో బాధ పడ్డారు.

దానికి శాస్త్రీయ బద్ధంగా అంత్యక్రియలు జరిపించారు.కాగా ఇటీవలే అది చనిపోయి 10 రోజులు కావడంతో దానికి దశదినకర్మ చేశారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు దశ దిన కర్మ లో పాల్గొన్న గా ఆ గేదె కు నివాళులు అర్పించారు.

ఆ కుటుంబం గ్రామస్తులందరికీ గేదె ఆత్మ శాంతి కోసం అన్నసంతర్పణ చేశారు.కాగా ఆ గేదె ను పెంచుకున్న వ్యక్తి సుభాష్ మాట్లాడుతూ.

ఆ గేదె మా ఇంట్లో మా కుటుంబంలో ఒకరిగా ఉండేది.ఇప్పుడది లోకాన్ని విడిచి వెళ్ళినందున శాస్త్రీయ పద్ధతిగా కర్మకాండలు చేశామని తెలిపారు.

ఏపీ ఎన్నికలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరివాడు.. ఈ ప్రశ్నలకు జవాబు ఇదే!