వీకెండ్స్‌లో కూడా తేలిపోయిన కామ్రేడ్, ఇక వీక్ డేస్‌లో కష్టమే
TeluguStop.com
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'డియర్ కామ్రేడ్' చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంకు బ్యాడ్ రివ్యూలు రావడంతో పాటు ప్రేక్షకుల నుండి కూడా బ్యాడ్ టాక్ వచ్చింది.
సినిమా సెకండ్ హాఫ్ మరీ స్లోగా సాగింది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
సెకండ్ హాఫ్ లో నిద్ర పోయామంటూ వస్తున్న ట్రోల్స్‌తో సినిమా కలెక్షన్స్ చాలా డ్రాప్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.
"""/"/
మొదటి రోజు సినిమాకు 11 కోట్ల మేరకు షేర్ వచ్చింది.
స్టార్ హీరోల స్థాయిలో ఈ చిత్రం రాబట్టడం అందరికి ఆశ్చర్యం కలిగించింది.అయితే శని మరియు ఆదివారాల్లో మాత్రం ఈ చిత్రం కనీసం మూడు కోట్ల షేర్‌ను రాబట్టలేక పోయింది.
వారాంతంలోనే ఇలా ఉంటే నేడు సోమవారం నుండి కలెక్షన్స్ మరీ దారుణంగా ఉంటాయనే టాక్ వినిపిస్తుంది.
బయ్యర్లు ఈ చిత్రం కొనుగోలు చేసిన మొత్తంలో కనీసం సగం అయినా వెనక్కు వస్తుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం పుంజుకుంది.వీక్ డేస్‌లో పెద్దగా రాబట్టలేక పోయిన ఇస్మార్ట్ శంకర్ శని మరియు ఆదివారాల్లో మంచి వసూళ్లను రాబట్టింది.
డియర్ కామ్రేడ్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఆ స్థాయిలో లేదు కనుక సినిమాను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు.
విజయ్ దేవరకొండ ఈ మద్య కాలంలో ఇలాంటి ఫ్లాప్‌ను చవి చూస్తాడని ఎవరు ఊహించలేదు.
తక్కువ సమయంలోనే విజయ్ దేవరకొండకు గట్టి దెబ్బ తలిగినట్లయ్యింది.