డియర్ మేఘాకి టైం కలిసి వచ్చిందా..!

నితిన్ తో లై, ఛల్ మోహన్ రంగ సినిమాలు చేసిన కోలీవుడ్ భామ మేఘా ఆకాష్.

కొద్దిపాటి గ్యాప్ తర్వాత తెలుగులో రాజ రాజ చోర, డియర్ మేఘ సినిమాలతో వస్తుంది.

రాజ రాజ చోర ఆల్రెడీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.తన మీద ఉన్న ఫ్లాప్ ముద్రని చెరిపి వేసుకుంది మేఘా ఆకాష్.

ఇక రాజ రాజ చోర తర్వాత వెంటనే డియర్ మేఘ సినిమాతో మరోసారి తన లక్ టెస్ట్ చేసుకుంటుంది.

రాజ రాజ చోర సినిమా సూపర్ హిట్ కాగా డియర్ మేఘా కూడా ప్రచార చిత్రాలతో అలరిస్తుంది.

సెప్టెంబర్ 3న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాపై కూడా హోప్స్ పెట్టుకుంది మేఘా అకాష్.

చూడచక్కని అందం.అభినయం ఉన్నా సరే మేఘా ఆకాష్ టాలీవుడ్ లో ఇప్పటివరకు లక్ కలిసి రాలేదు.

రాజ రాజ చోరా అమ్మడికి ఇక్కడ హిట్ ఖాతా తెరచింది.డియర్ మేఘాతో కూడా హిట్టు పడితే మేఘా ఆకాష్ తెలుగులో మరికొన్ని సినిమాలు చేసే అవకాశం ఉంటుంది.

తమిళంలో తన నటనతో మెప్పిస్తూ క్రేజ్ తెచ్చుకున్న మేఘా ఆకాష్ తెలుగులో కూడా పాపులర్ అవ్వాలని చూస్తుంది.

ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వస్తున్న డియర్ మేఘా అమ్మడికి ఏమాత్రం లక్ కలిసి వచ్చేలా చేస్తుందో చూడాలి.

మొండి చుండ్రును వదిలించే మ్యాజికల్ రెమెడీ ఇది.. ఒక్క వాష్ లోనే రిజల్ట్ అదిరిపోతుంది!