ఆస్కార్‌ ముందు నిలిచిన మన కామ్రేడ్‌

విజయ్‌ దేవరకొండ నటించిన 'అర్జున్‌ రెడ్డి' చిత్రం తెలుగు పరిశ్రమకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు రావడం జరిగింది.

బాహుబలి వంటి భారీ చిత్రాలను మాత్రమే కాకుండా అర్జున్‌ రెడ్డి వంటి విభిన్న చిత్రాలను తీయగల సత్తా తెలుగు వారికి ఉందని నిరూపించింది.

అర్జున్‌ రెడ్డి చిత్రం హిందీ, తమిళం ఇంకా పలు భాషల్లో రీమేక్‌ అయ్యింది, అవుతోంది.

అర్జున్‌ రెడ్డి తర్వాత ఆ స్థాయిలో ఉంటుందనుకున్న చిత్రం 'డియర్‌ కామ్రేడ్‌'.భరత్‌ కమ్మ దర్శకత్వంలో రూపొందిన డియర్‌ కామ్రేడ్‌ చిత్రం అన్ని భాషల్లో కూడా నిరాశ పర్చింది.

డియర్‌ కామ్రేడ్‌ చిత్రం ఆర్ధికంగా పర్వాలేదు అనిపించినా టాక్‌ పరంగా మాత్రం తీవ్రంగా నిరాశ పర్చింది.

ఏమాత్రం ఆకట్టుకోని కథ కథనం అంటూ విమర్శలు ఎదుర్కొంది.విజయ్‌ దేవరకొండకు ఉన్న క్రేజ్‌తో కలెక్షన్స్‌ వచ్చాయి.

అంతకు మించి కామ్రేడ్‌ సినిమాను హిట్‌ అనలేం అంటూ అంతా అన్నారు.అయితే ఇప్పుడు ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెడరేషన్‌ డియర్‌ కామ్రేడ్‌ చిత్రాన్ని ఏకంగా ఆస్కార్‌కు నామినేట్‌ చేయడం జరిగింది.

ఇండియా నుండి మొత్తం పాతిక సినిమాలకు ఛాన్స్‌ ఇవ్వగా అందులో డియర్‌ కామ్రేడ్‌ కూడా నిలిచింది.

"""/"/  తెలుగు ఇండస్ట్రీ నుండి కేవలం డియర్‌ కామ్రేడ్‌కు మాత్రమే ఛాన్స్‌ దక్కడం ఆశ్చర్యంగా ఉంది.

ఎన్నో సినిమాలు కామ్రేడ్‌ను మించిన సక్సెస్‌లు అయ్యాయి.సబ్జెక్ట్‌ పరంగా కూడా ఆకట్టుకున్నాయి.

మరి కామ్రేడ్‌ను మాత్రమే ఎందుకు ఎంపిక చేశారనేది వారికి మాత్రమే తెలియాలి.సరే ఎందుకు ఎంపిక చేసినా కూడా తెలుగు సినిమా ఆస్కార్‌ బరిలో నిలవడం అనేది ప్రతి ఒక్కరు గర్వించదగ్గ విషయం.

హిందీ సినిమా గల్లీబాయ్స్‌కు ఆస్కార్‌ అవార్డు దక్కే ఛాన్స్‌ ఉందని ఎక్కువ శాతం నమ్మకంగా ఉన్నారు.

బై లక్‌గా డియర్‌ కామ్రేడ్‌ చిత్రం ఆస్కార్‌ అవార్డును దక్కించుకుంటుందేమో చూడాలి.

షుగ‌ర్ వ్యాధి ఉన్న‌వారు దానిమ్మ పండు తినొచ్చా..నిపుణులు ఏమంటున్నారు..?