వైసీపీ ప్రభుత్వానికి డెడ్ లైన్..27 లోపు అప్పులు కట్టకపోతే సేవలు ఆగిపోనుందా..!
TeluguStop.com
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్లో అత్యంత ప్రజాధారణ పొందిన పధకం 'ఆరోగ్యశ్రీ( Aarogyasri )'.
ఈ పధకం ద్వారా పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందింది.గడిచిన నాలుగేళ్లలో ప్రభుత్వం ఈ పథకం ని విజయవంతంగా కొనసాగిస్తూ వచ్చింది.
దివంగత నేత స్వర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఈ పథకం ఆయన హయాం లో పేద ప్రజలకు ఒక సంజీవిని లాగ నిల్చింది.
అదే పథకం ని కొనసాగిస్తూ వచ్చాయి ప్రభుత్వాలు.2019 కి ముందు తెలుగు దేశం పార్టీ హయాం లో కూడా ఈ పథకం కొనసాగింది.
ఇప్పుడు వైసీపీ( YCP ) పాలనలో కూడా ఈ పథకం అదే విధంగా నిన్న మొన్నటి వరకు నడిచింది.
కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అప్పుల ఊబిలో చిక్కుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
రాష్ట్రానికి ఆదాయం లేదు, ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ ఆస్తులను కూడా తాకట్టు పెట్టి సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాడు.
"""/" /
ఇదంతా పక్కన పెడితే గత ఏడాది నుండి ప్రైవేట్ హాస్పిటల్స్ కి ఆరోగ్య శ్రీ బిల్లులు కట్టడం మానేసింది మన రాష్ట్ర ప్రభుత్వం.
ఆంధ్ర ప్రదేశ్ హాస్పిటల్స్ అసోసియేషన్ అనేక సార్లు ప్రభుత్వాన్ని బకాయిలు చెల్లించాల్సిందిగా రిక్వెస్ట్ చేసారు.
కానీ ప్రభుత్వం నుండి సరైన సమాధానం ఒక్కటి కూడా రాలేదు.ఎదురు చూసి చూసి విసిగిపోయిన అసోసియేషన్ అధ్యక్షులు మురళీకృష్ణ( Muralikrishna ) ప్రభుత్వానికి ఒక లేఖ రాసాడు.
ఈ నెల 27 వ తారీఖు లోపు బకాయిలు చెల్లించకపోతే, ఆరోగ్యశ్రీ సేవలను సంపూర్ణంగా నిలిపివేస్తాం అని హెచ్చరికలు జారీ చేసారు.
ఒక్కసారి ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోతే వైసీపీ పార్టీ కి ఘోరమైన నష్టం వాటిల్లుతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ అందించిన నివేదిక ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయిల బ్యాలన్స్ కట్టాల్సి ఉన్నట్టుగా చెప్పుకొచ్చింది.
ప్రభుత్వం కనీసం వెయ్యి కోట్లు కూడా కట్టలేని దీనమైన స్థితి లో ఉందా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
"""/" /
అసలు ప్రభుత్వానికి బకాయిలు కట్టే ఉద్దేశ్యం ఉందా లేదా?, ఎన్నికల సమయం సమీపిస్తోంది, ఇలాంటి సమయం లో కోట్లాది మందికి ఉపయోగపడే ఆరోగ్యశ్రీ పథకం ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నట్టు?, ఇన్ని రోజులు ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించారు కదా, ఎన్నికలకు ఇంకా కేవలం 5 నెలల సమయం మాత్రమే ఉంది.
ఇలాంటి పీక్ మూవ్మెంట్ లో ఆరోగ్య శ్రీ పథకం ఆగినా జనాలు పెద్దగా పట్టించుకోరు, ఆ వెయ్యి కోట్ల రూపాయిలు దాచిపెట్టుకుంటే ఎన్నికలకు డబ్బులు పంచడానికి ఉపయోగపడుతుంది కదా అనే ఆలోచన లో వైసీపీ ప్రభుత్వం ఉందా అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
టీడీపీ కి గవర్నర్ పదవి .. ఈ ముగ్గురిలో బాబు ఛాయిస్ ఎవరో ?